కప్పు నీదా నాదా.. సై : భారత్Vsఆసీస్ ఫైనల్ మ్యాచ్

కప్పు నీదా నాదా.. సై : భారత్Vsఆసీస్ ఫైనల్ మ్యాచ్

వరల్డ్ కప్‌కు భారత్ ఆడుతోన్న ఆఖరి మ్యాచ్.. ఆస్ట్ర్రేలియాతో విజయమో.. పరాభవమో తేలేందుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. వరల్డ్ కప్‌లో ఆడే జట్టు కోసం టీమిండియా చేసిన ప్రయోగాలన్నింటికీ ఇదే చివరి అవకాశం. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరగనున్న తుది పోరులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సొంతగడ్డపై సిరీస్ ఫలితం తేల్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కీలకంగా భావించి ఆడిన నాల్గో వన్డేలో భారీ టార్గెట్‌తో నిలిచినప్పటికీ కోహ్లీసేన విజయాన్ని రాబట్టలేకపోయింది.
Read Also : ఓ పాక్.. భారత్ మాకు చెప్పే చేసింది: ఐసీసీ

ఫీల్డింగ్‌లో వైఫల్యాలను ప్రధాన కారణాలుగా చెప్పుకొచ్చిన ధోనీ స్టంపౌట్ మిస్ చేయడమూ ఓడిపోయేలా చేసిందని మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియా ముందు వెల్లడించాడు. మరో వైపు సిరీస్‌లో అనూహ్యంగా ఊపందుకుని రాణిస్తున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, టర్నర్‌లను కట్టడి చేయాలంటే బౌలింగ్ విభాగం పటిష్టంగా పని చేయాల్సి ఉంది. ఎందుకంటే, రాంచీ వేదికగా జరిగిన 3వ వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భారత్ ముందు భారీ టార్గెట్ ఉంచి చిత్తుగా ఓడించింది. ఆ మ్యాచ్‌లో తీవ్రంగా శ్రమించినప్పటికీ భారత బ్యాట్స్‌మెన్ లక్ష్యాన్ని చేధించలేకపోయారు. 

ఇంకోవైపు, ధోనీ లేకపోవడం వల్లనే ఇలా చేదు అనుభవం ఎదురైందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. వికెట్ కీపర్ వైఫల్యమై అయితే మహీ ఇప్పటికే విశ్రాంతి కోసం రెండు వన్డేలకు దూరమైనట్లు ఖరారైపోయింది. ఈ సమయంలో ఐపీఎల్ కోసం సిద్ధమవుతోన్న వృద్ధిమాన్ సాహా ఒక్కడే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. కానీ, కోహ్లీ సిరీస్ ఆరంభమైనప్పటి నుంచి జట్టులో మార్పులు చేయడానికి సిద్ధంగా లేడు. కేవలం వన్డే జట్టుకు ధోనీ స్థానాన్ని మాత్రమే మార్పు చేసిన కోహ్లీ ఏ పాటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

వేదిక:
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం

సమయం:
బుధవారం మధ్యాహ్నం 1.30గంటలకు

తుది జట్ల (అంచనా):
టీమిండియా: 
విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, కేదర్ జాదవ్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్.

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, షాన్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోనిస్, ఆష్టన్ టర్నర్, జై రిచర్డ్‌సన్, ఆడం జంపా, ఆండ్రూ టై, పాట్ కమిన్స్, నాథన్ కౌల్టర్ నైల్, అలెక్యా క్యారీ, నాథన్ లయన్, జాసన్ బహ్రెండార్ఫ్.