ఒక్క సెంచరీతో రికార్డులు కొట్టేసిన కోహ్లీ

ఒక్క సెంచరీతో రికార్డులు కొట్టేసిన కోహ్లీ

డే అండ్ నైట్ టెస్టులోనూ బంగ్లాదేశ్‌పై భారత్ పరుగుల వరద పారిస్తోంది. శుక్రవారం మొదలైన మ్యాచ్ లో 106పరుగులకే బంగ్లాదేశ్ ను ఆల్ అవుట్ చేసిన టీమిండియా.. రెండో రోజు 174/3ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించి అద్భుతహ అనే రీతిలో ఆడుతోంది. కెప్టెన్ కోహ్లీ క్రీజులో పరుగుల వర్షం కురిపించాడు. 

టెస్టు ఫార్మాట్ లోనే కాకుండా అంతర్జాతీయ క్రికెట్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. టెస్టుల్లో 27వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ.. వేగవంతమైన 70వ అంతర్జాతీయ సెంచరీ కూడా పూర్తి చేసేశాడు. 

ఈ ఫీట్ సాధించడానికి విరాట్ కోహ్లీ కేవలం 439ఇన్నింగ్స్ మాత్రమే తీసుకుంటే సచిన్ టెండూల్కర్ 505 ఇన్నింగ్స్‌లు, రిక్కీ పాంటింగ్ 649ఇన్నింగ్స్ లు తీసుకున్నాడు. 

అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్ లో కెప్టెన్ గా కోహ్లీ 41 సెంచరీలతో టాప్ పొజిషన్ లో నిలిచాడు. టెస్టు కెప్టెన్ గా ఇది 20వ సెంచరీ. డే అండ్ నైట్ టెస్టు ఫార్మాట్లో తొలిసారి సెంచరీ చేసిన భారత ప్లేయర్ గా నిలిచాడు. 

డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన కోహ్లీ.. ఇబాదత్ హుస్సేన్ బౌలింగ్‌లో 139పరుగుల వద్ద తైజుల్ ఇస్లామ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.