బ్యాట్‌పై ‘The Boss’ స్టిక్టర్‌ను గేల్ ఎందుకు చూపించాడో తెలుసా..

బ్యాట్‌పై ‘The Boss’ స్టిక్టర్‌ను గేల్ ఎందుకు చూపించాడో తెలుసా..

IPL 2020 సీజన్లో బెంచ్ కే పరిమితమైన Chris Gayle ఆడిన తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచరీకి మించిన స్కోరుతో అదరగొట్టాడు. అద్భుతమైన ప్రదర్శనతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ను విజయతీరాలకు చేర్చాడు. ఏడు గేమ్ ల తర్వాత ఆడిన మ్యాచ్ లో 173పరుగుల లక్ష్య చేధనకు మూడో పొజిషన్ లో బ్యాటింగ్ కు దిగాడు.

45బంతుల్లో 53పరుగులు చేసిన గేల్.. జట్టును విన్నర్ చేశాడు. హాఫ్ సెంచరీ చేసిన గేల్.. బ్యాట్‌పైన ఉన్న ద బాస్ స్టిక్టర్ ను చూపిస్తూ సైగ చేశాడు. అది చూస్తే ఎవరికో స్పెషల్ మెసేజ్ ఇస్తున్నట్లుగా ఉంది.



కామెంటేటర్ గా మారిన కెవిన్ పీటర్సన్ తో మ్యాచ్ అనంతరం మాట్లాడిన గేల్.. ఆ సైగకు అర్థాన్ని వివరించాడు. ‘అందరికీ చెప్తున్నా. పేరుకు గౌరవం ఇవ్వండి (అని బ్యాట్ పై ఉన్న స్టిక్కర్ చూపించా). అంతే’ అని చెప్పాడు.

ఈ నేల చాలా స్లోగా ఉంది. కానీ, సెకండ్ ఇన్నింగ్స్ ఆడడం కాస్త బెటర్ అనిపించింది. టీం మూడో స్థానంలో దిగాలని చెప్పింది. అదేం అంత సమస్య కాదు. ఓపెనర్లు టోర్నమెంట్ మొత్తం బాగా బ్యాటింగ్ చేశారు. అది డిస్టర్బ్ చేయాలనుకోలేదు. నాకు ఇచ్చిన పనిని పూర్తి చేశాను’ అని గేమ్ తర్వాత గేల్ మాట్లాడాడు.

అతని ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ.. బెంచ్ కే పరిమితమై ఉండాలని ఏ ప్లేయర్ కోరుకోడు. కానీ, నేను నా అనారోగ్యాన్ని కూడా ఎంజాయ్ చేశా. ఇప్పుడు ఇంకా ఫిట్ గా ఉన్నా. అని వివరించాడు. గేల్ తో పాటుగా రాహుల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. మయాంక్ అగర్వాల్ జట్టుకు దన్నుగా నిలిచాడు. ఈ గేమ్ పంజాబ్ జట్టుకు ప్లే ఆఫ్ పై మళ్లీ ఆశ పుట్టించేలా చేసింది. మిగిలిన 6గేమ్స్ గెలిస్తే చేరుకునే అవకాశం ఉంది.