IPL 2021 : హర్షల్ పటేల్ సరికొత్త రికార్డు..ఒకే సీజన్‌లో 26వికెట్లు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ కొత్త రికార్డు నెలకొల్పాడు. అత్యధిక వికెట్లు తీసిన అన్ క్యాప్డ్ హర్షల్ నిలిచారు.

IPL 2021 : హర్షల్ పటేల్ సరికొత్త రికార్డు..ఒకే సీజన్‌లో 26వికెట్లు

Ipl 2021

Harshal Patel New Record : ఐపీఎల్ 2021 మ్యాచ్ లు ఎంతో ఉత్కంఠగా జరుగుతున్నాయి. కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ కొత్త రికార్డు నెలకొల్పారు. అత్యధిక వికెట్లు తీసిన అన్ క్యాప్డ్ హర్షల్ నిలిచారు. 2021, సెప్టెంబర్ 29వ తేదీ బుధవారం రాజస్థాన్ రాయల్స్ – రాయల్ చాలంజర్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హర్షల్ మూడు వికెట్లు తీసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఒక సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

Read  More : Mumbai : వాకింగ్ స్టిక్‌తో చిరుతతో మహిళ పోరాటం.. చివరికి

ఈ సీజన్ లో మొత్తం 11 మ్యాచ్ లో ఆడిన ఈ ప్లేయర్..26 వికెట్లు తీశారు. తన ఆర్సీబీ టీమ్ మేట్ యజువేంద్ర చాహల్ రికార్డును బ్రేక్ చేశారు. 2015లో చాహల్ అన్ క్యాప్డ్ ప్లేయర్ గా 23 వికెట్లు తీశారు. గతంలో ఈ రికార్డు 23 వికెట్లతో చాహల్ తో పాటు వినయ్ కుమార్ పేరిట ఉంది. ఇప్పటి వరకు ఒకే సీజన్ ఐపీఎల్ లో చెన్నై బౌలర్ డ్వేన్ బ్రేవో 32 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పారు. వాస్తవానికి ఢిల్లీ క్యాపిటల్ జట్టులో హర్షల్ ఉన్నారు. అయితే..ఆ టీమ్ నుంచి ఆర్సీబీ తీసుకుంది. ఇతనిని తీసుకోవడం ద్వారా..ఆర్సీబీకి బాగా కలిసొస్తోంది. ఇప్పుడు బ్రేవో రికార్డుపై హర్షల్ కన్నేశారు.