IPL 2021 RR Vs SRH : హైదరాబాద్ టార్గెట్ 165

ఐపీఎల్ 2021 సీజన్ 2లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్

IPL 2021 RR Vs SRH : హైదరాబాద్ టార్గెట్ 165

Ipl 2021 Rr Vs Srh

IPL 2021 RR Vs SRH : ఐపీఎల్ 2021 సీజన్ 2లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ చెలరేగాడు. 57 బంతుల్లో 82 పరుగులు చేశాడు. యశస్వి జైశ్వాల్ 36 పరుగులు, మహిపాల్ 29 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ రెండు వికెట్లు, సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.

ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన రాజస్తాన్ ఆ తర్వాత దూకుడుగా ఆడింది. కానీ, చివర్లో తడబడింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (82) అద్భుత అర్ధశతకం సాధించడంతో రాజస్తాన్ ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. ఓపెనర్ ఎవిన్‌ లూయిస్‌ (6) విఫలం కాగా.. అనంతరం వచ్చిన సంజూ శాంసన్‌ మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ (38)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అయితే జైశ్వాల్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లివింగ్‌స్టోన్‌ (4) ఎక్కువసేపు నిలబడలేదు. 10 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసిన రాజస్థాన్‌ను మహిపాల్‌ లామరర్‌ (29)తో కలిసి శాంసన్‌ ఆదుకున్నాడు. వీరిద్దరూ కలిసి 84 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే స్వల్ప వ్యవధిలో సంజూతోపాటు పరాగ్‌ పెవిలియన్‌కు చేరడంతో రాజస్థాన్‌ 164 పరుగులకే పరిమితమైంది.