IPL2022 KKR Beats CSK : ఐపీఎల్‌లో కోల్‌కతా బోణీ.. చెన్నైపై గెలుపు

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన టీ20 లీగ్ 15వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో చెన్నైపై కోల్ కతా జట్టు విజయం సాధించింది.(IPL2022 KKR Beats CSK)

IPL2022 KKR Beats CSK : ఐపీఎల్‌లో కోల్‌కతా బోణీ.. చెన్నైపై గెలుపు

Kkr Beats Csk

IPL2022 KKR Beats CSK : ఐపీఎల్ 2022- 15వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ బోణీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 132 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్.. 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కోల్ కతా బ్యాటర్లలో ఓపెనర్ రహానె 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రహానె కేకేఆర్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. నితీష్ రానా(21), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (20*), శామ్ బిల్లింగ్స్(25) రాణించారు. చెన్నై బౌలర్లలో బ్రావో మూడు వికెట్లు తీశాడు. మిచెల్ శాంట్నర్ ఒక వికెట్ తీశాడు.

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కోల్ కతా ముందు 132 పరుగుల మోస్తరు టార్గెట్ ఉంచింది. ఈ మ్యాచ్ లో కోల్ కతా బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ప్రత్యర్థిని కట్టడి చేశారు. 61 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సీఎస్కేని మాజీ కెప్టెన్ ధోని ఆదుకున్నాడు.(IPL2022 KKR Beats CSK)

IPL-2022 Matches : నేటి నుంచి ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం.. ఈసారి అన్ని మ్యాచ్​లు భారత్‌లోనే

ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో ధోనీ ధనాధన్ ఆటతీరు ఆవిష్కృతమైంది. జట్టు కష్టాల్లో పడడంతో, పాత ధోనీ కనిపించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లను చివరి ఓవర్లలో ఓ ఆటాడుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఓ దశలో చెన్నై జట్టు 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా ఆదుకున్నారు.

Ipl2022 Kkr Beats Csk

Ipl2022 Kkr Beats Csk

ముఖ్యంగా ధోనీ దూకుడు ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీ రోల్ ప్లే చేశాడు. ధోనీ 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో అజేయంగా 50 పరుగులు చేశాడు. అతడికి జడేజా నుంచి చక్కని సహకారం లభించింది. జడేజా 28 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ జోడీ చివరి 5 ఓవర్లలో 58 పరుగులు రాబట్టడం విశేషం. రసెల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆఖరి బంతిని జడేజా సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి.

Watch IPL 2022 Live Matches : భారత్ సహా ప్రపంచంలో ఎక్కడైనా ఐపీఎల్ లైవ్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో ఇలా చూడొచ్చు..!

 

చెన్నై జట్టులో మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0) డకౌట్ కాగా, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 3 పరుగులు చేసి నిరాశపరిచాడు. రాబిన్ ఊతప్ప 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులు చేశాడు. రాయుడు (15) రనౌట్ కాగా, యువ ఆల్ రౌండర్ శివమ్ దూబే 3 పరుగులు చేశాడు. కోల్ కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి 1, ఆండ్రీ రస్సెల్ 1 వికెట్ తీశారు. గత సీజన్‌ ఫైనల్ పోరులో చెన్నై చేతిలో ఓటమి చవిచూసిన కోల్ కతా నైట్ రైడర్స్.. ఈ సీజన్ లో విక్టరీ కొట్టడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది.