IPL 2022 : జట్ల వారీగా పలికిన ధరలు..వేల కోట్లు

క్రికెట్ క్రీడాభిమానులను పరుగుల మత్తులో ముంచెత్తే...ఐపీఎల్ వచ్చే ఏడాది నుంచి మరింత రంజుగా సాగనుంది.

IPL 2022 : జట్ల వారీగా పలికిన ధరలు..వేల కోట్లు

Ipl 2022

IPL 2022 Auction : క్రికెట్ క్రీడాభిమానులను పరుగుల మత్తులో ముంచెత్తే…ఐపీఎల్ వచ్చే ఏడాది నుంచి మరింత రంజుగా సాగనుంది. ప్రస్తుతం ఉన్న 8 టీమ్‌లకు తోడు.. మరో రెండు టీమ్‌లు ఐపీఎల్‌లో భాగస్వామ్యం  కానున్నాయి. ఐపీఎల్‌-2022లో మొత్తం 10 జట్లు  టైటిల్‌ పోరులో నిలబడనున్నాయి. ఐపీఎల్ బరిలోకి కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు వచ్చి చేరాయి. కళ్లు చెదిరే మొత్తాన్ని చెల్లించి ఈ టీమ్‌లను బడా  సంస్థలు దక్కించుకున్నాయి. గోయంకాగ్రూప్‌, సీవీసీ కేపిటల్‌ పార్ట్‌నర్స్‌ బిడ్‌ విజేతలుగా నిలిచాయి.2008లో ఐపీఎల్ జట్లను ప్రకటించినప్పుడు అత్యధికంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పలకగా.. అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ పలికింది. 2008లో జరిగిన ఐపీఎల్ వేలంలో జట్ల వారీగా పలికిన ధరలు పరిశీలిస్తే..

Read More : Sania Mirza: పాకిస్తాన్ క్రికెటర్‌ను ‘బావ గారూ..’ అంటున్న భారత్ ఫ్యాన్స్.. సానియా ఫుల్ హ్యాపీ!!

రాయల్ ఛాలెంజ్స్ బెంగళూరు 455.64 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ 357.44కోట్లు, ఢిల్లీ డేర్ డెవిల్స్ 329.95కోట్లు, అప్పటి డెక్కన్ చార్జర్స్.. ప్రస్తుత సన్ రైజర్ హైదరాబాద్  420.29కోట్లు, రాజస్థాన్ రాయల్స్ 263.17కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ 294.95కోట్లు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 298.52కోట్లు, ముంబై ఇండియన్స్ వేలంలో 439.54కోట్లు పలికింది. ఐపీఎల్‌లో 2008 నుంచి కొనసాగుతున్న 8టీమ్‌ల్లో 7జట్ల విలువ పెరుగగా.. రాజస్థాన్ రాయల్స్ విలువ పడిపోయింది. ఇక స్పాన్సర్ షిఫ్ ఫీజు విషయానికొస్తే.. 40కోట్లతో మొదలై.. ప్రస్తుతం 439.8కోట్లకు చేరింది. 2013 నుంచి 15వరకు 79.4కోట్లు, 2016-17లో 100కోట్లు, 2018-19లో 439.8కోట్లు చేరింది. 2020-21 ఏడాదిలో కరోనా ఎఫెక్ట్ పడింది.

Read More : IND vs PAK : టీమిండియా ఓటమితో అభిమాని మృతి!

దానికి తోడు భారత్, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడం కూడా స్పాన్సర్ షిఫ్ ఫీజుపై ఎఫెక్ట్ చూపింది. ఐపీఎల్ మొదటి నుంచి స్పాన్సర్ షిప్ దక్కించుకున్న వీవో ఆ ఏడాది తప్పుకుంది. దీంతో డ్రీమ్ ఎలెవన్ 222కోట్లతో స్పాన్సర్ షిప్ దక్కించుకుంది. ఈ ఏడాది వీవో.. 439.8కోట్లతో తిరిగి స్పాన్సర్ షిప్ దక్కించుకుంది. 2023వరకు ఏడాదికి 43.98కోట్లు స్పాన్సర్ షిప్ ఫీజుగా ఉండనుంది.7 వేల 90కోట్లు చెల్లించి లక్నో జట్టును RPSG గ్రూప్‌ దక్కించుకుంది. సంజీవ్‌గోయంకా నేతృత్వంలో  RPSG గ్రూప్‌ నడుస్తోంది. ఇక అహ్మదాబాద్‌ జట్టుకు సీవీసీ కేపిటల్‌ పార్ట్‌నర్స్‌ 5వేల 625 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది.

Read More : IPL New Teams: కళ్లు చెదిరే ధరకు.. ఐపీఎల్‌లో మరో రెండు జట్లు!

బేస్‌ప్రైస్‌ 2వేల కోట్ల రూపాయలుగా బీసీసీఐ నిర్ణయించినా భారీ మొత్తానికి బిడ్లు  పడ్డాయి. పదిలక్షలు చెల్లించి మొత్తం 28బిడ్ అప్లికేషన్లు తీసుకున్నారు. 10మంది మాత్రమే బిడ్లు వేయగా… చివరకు ఈ రెండు కంపెనీలు విజేతలుగా నిలిచాయి. ఈ రెండు జట్లతో బీసీసీఐకి 12వేల 715 కోట్ల  రూపాయలకు పైగా ఆదాయం రానుంది. ఐపీఎల్‌- 2022లో బరిలో 10జట్లు పోటీపడతాయని బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఎనిమిది జట్లు ఉన్నాయి. వాటిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ముంబయి  ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్‌ హైదరాబాద్‌లు పోటీ పడుతున్నాయి. తాజా వేలంలో కొత్తగా అహ్మదాబాద్‌, లఖ్‌నవూ జట్లు వచ్చి చేరాయి.