IPL 2022: ప్రేక్షకుల్లేకుండా భారత్‌లోనే ఐపీఎల్‌ మ్యాచ్‌లు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ భారతదేశంలో నిర్వహించబడుతుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)లోని అగ్ర వర్గాలు ధృవీకరించాయి.

IPL 2022: ప్రేక్షకుల్లేకుండా భారత్‌లోనే ఐపీఎల్‌ మ్యాచ్‌లు!

Ipl 2022

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ భారతదేశంలో నిర్వహించబడుతుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)లోని అగ్ర వర్గాలు ధృవీకరించాయి. దేశంలో కోవిడ్-19 తగ్గితే, భారత్‌లో ఐపీఎల్ 2022ని నిర్వహించేందుకు బోర్డు ముందుకు వెళ్తుందని, కోవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

“ఐపిఎల్ 2022 భారతదేశంలో నిర్వహించబడుతుందని, టోర్నమెంట్ ప్రేక్షకుల్లేకుండా నిర్వహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చెబుతోంది బీసీసీఐ. ఐపీఎల్ 2022 కోసంవాంఖడే స్టేడియం, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(CCI), ముంబైలోని డివై పాటిల్ స్టేడియం.. అవసరమైతే పూణే స్టేడియంను రెడీ చెయ్యనున్నట్లు బీసీసీఐ చెబుతోంది.

IPL ప్లేయర్ రిజిస్ట్రేషన్ జనవరి 20వ తేదీతో ముగియగా.. మొత్తం 1,214 మంది ఆటగాళ్లు (896 మంది భారతీయులు, 318 మంది ఓవర్సీస్) 2022 ప్లేయర్ వేలంలో భాగంగా సైన్ అప్ చేశారు.

రెండు రోజుల పాటు జరిగే మెగా వేలంలో ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ ప్రతిభావంతుల కోసం 10 జట్లు పోటీ పడనున్నాయి. ఆటగాళ్ల లిస్ట్‌లో 270 క్యాప్డ్, 903మంది అన్‌క్యాప్డ్, 41మంది అసోసియేట్ ప్లేయర్‌లు ఉన్నారు.