IPL 2023: అత్యధిక సిక్సులు కొట్టిందెవరు?.. పాయింట్ల పట్టికలో ముందంజలో ఏయే జట్లు?

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ లో జోరుమీదున్నాడు. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తొలి రెండు మ్యాచుల్లో అదరగొట్టేశాయి.

IPL 2023: అత్యధిక సిక్సులు కొట్టిందెవరు?.. పాయింట్ల పట్టికలో ముందంజలో ఏయే జట్లు?

IPL 2023

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో గురువారం వరకు 9 మ్యాచులు జరిగాయి. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), ముంబై ఇండియన్స్ (Mumbai Indians), కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), పంజాబ్ కింగ్స్ (Punjab Kings), లఖ్ నవూ సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఆడుతున్నాయి.

గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటివరకు ఆడిన రెండేసి మ్యాచుల్లోనూ గెలుపొందాయి. దీంతో ఆ జట్లు నాలుగేసి పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నెట్ రన్ రేట్ 0.700తో గుజరాత్ టైటాన్స్ అగ్ర స్థానంలో, నెట్ రన్ రేట్ 0.333తో పంజాబ్ కింగ్స్ రెండో స్థానంలో ఉన్నాయి.

IPL 2023

IPL 2023

అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 2 మ్యాచులు ఆడి 149 పరుగులు చేశాడు. ఫోర్ల కన్నా సిక్సులు ఎక్కువగా కొట్టాడు. ఇప్పటివరకు 13 సిక్సులు బాది IPL 2023లో అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్ గా ఉన్నాడు. అతడి తర్వాత స్థానంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బ్యాటర్ కైల్ మేయర్స్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతడు 2 మ్యాచులు ఆడి 126 పరుగులు చేశాడు. వాటిల్లో 9 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి.

బౌలర్లలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్లేయర్ మార్క్ వుడ్ 2 మ్యాచులు ఆడి 8 వికెట్లు తీశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ వరుణ్ చక్రవర్తి 2 మ్యాచులు ఆడి 5 వికెట్లు పడగొట్టాడు.

IPL Bowling records: ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు వీరే..