IPL 2023: పాయింట్ల పట్టికలో టాప్-1కు ధోనీ టీమ్.. ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఆర్సీబీ బ్యాటర్

IPL 2023: సీఎస్కే ఇప్పటివరకు మొత్తం 7 మ్యాచులు ఆడి ఐదింటిలో గెలుపొందింది. రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచులు ఆడి నాలుగింటిలో గెలుపొంది రెండో స్థానంలో ఉంది.

IPL 2023: పాయింట్ల పట్టికలో టాప్-1కు ధోనీ టీమ్.. ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఆర్సీబీ బ్యాటర్

MS Dhoni

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) పాయింట్ల పట్టికలో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) అగ్రస్థానానికి దూసుకెళ్లింది. నిన్న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై 49 ప‌రుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు చేరాయి.

సీఎస్కే ఇప్పటివరకు మొత్తం 7 మ్యాచులు ఆడి ఐదింటిలో గెలుపొందింది. రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచులు ఆడి నాలుగింటిలో గెలుపొంది రెండో స్థానంలో, లక్నో సూపర్ జెయింట్స్ కూడా 7 మ్యాచులు ఆడి నాలుగింటిలో గెలుపొంది మూడో స్థానంలో ఉంది. ఐపీఎల్ లో ఇప్పటివరకు మొత్తం 33 మ్యాచులు జరిగాయి.

చెన్నై, లక్నో, కోల్‌కతా జట్లతో పాటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతున్నాయి. పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ (Orange Cap) రేసులో ఆర్సీబీ బ్యాటర్ డు ప్లెసిస్ అగ్రస్థానంలో ఉన్నాడు.

అతడు 7 మ్యాచుల్లో 7 ఇన్నింగ్స్ ఆడి 405 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానంలో సీఎస్కే బ్యాటర్ డెవాన్ కాన్వే నిలిచాడు. అతడు 7 మ్యాచుల్లో 7 ఇన్నింగ్స్ ఆడి 314 పరుగులు చేశాడు. అత్యధిక వికెట్లు తీసిన వారికి ఇచ్చే పర్పుల్‌ క్యాప్‌ రేసులో ఆర్సీబీ బౌలర్ సిరాజ్ 13 వికెట్లు తీసి, అగ్రస్థానం ఉండగా, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ అర్ష్ దీప్ సింగ్ (13 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు.

IPL 2023, KKR vs CSK: ఈడెన్‌లో చెన్నై జోరు.. కోల్‌క‌తాపై ఘ‌న విజ‌యం