Fifa World Cup: జపాన్ ఫ్యాన్స్ సూపర్..! ఫిఫా వరల్డ్‌కప్‌లో జర్మనీపై జపాన్ విజయం.. స్టేడియంలో ఫ్యాన్స్ చేసిన పనికి అంతా షాక్?

జపాన్ సంస్కృతిలో శుభ్రత ఒక భాగం. చిన్నతనం నుంచి ప్రజల్లో శుభత్రను అలవాటు చేసుకుంటారు. ఈ క్రమంలో వారు స్టేడియంలోని స్టాండ్లలో చెత్తను క్లీన్ చేసి అందరిచేత సూపర్ అనిపించుకున్నారు. జపాన్ ఫ్యాన్స్ చెత్తను తొలగిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. ‘జపాన్ జట్టు ఒకవేళ వరల్డ్ కప్ గెలవకపోయినా.. వారి అభిమానులు మాత్రం ఇప్పటికే విజేతలుగా నిలిచారంటూ’ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Fifa World Cup: జపాన్ ఫ్యాన్స్ సూపర్..! ఫిఫా వరల్డ్‌కప్‌లో జర్మనీపై జపాన్ విజయం.. స్టేడియంలో ఫ్యాన్స్ చేసిన పనికి అంతా షాక్?

Japan's fans

Fifa World Cup: ఖతార్‌లో క్రీడా సంబురం అంబరాన్ని తాకుతోంది. ఫిఫా ప్రపంచకప్‌లో అభిమాన జట్లు హోరీహోరీగా తలపడుతుంటే ఫ్యాన్స్ స్టేడియంలోని స్టాండ్స్‌లో కేరింతలు కొడుతూ సందడి చేస్తున్నారు. కొన్ని జట్ల అభిమానులు తమ జట్టు విజయాన్ని స్టేడియంలో ఘనంగా జరుపుకుంటున్నారు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులు కూర్చొనే ప్రదేశాల్లో చెత్తతో నిండుకుపోతున్నాయి. వాటిని క్లీన్ చేసేందుకు స్టేడియం సిబ్బంది కష్టడాల్సి వస్తుంది. కానీ, జపాన్ జట్టు ఫ్యాన్స్ మాత్రం తమ జట్టు విజయాన్నిఅందరూ ఆశ్చర్యపోయేలా సెలబ్రేట్ చేసుకున్నారు. వారుచేసిన పనికి ప్రతీఒక్కరి ఫిదా అయ్యేలా చేశారు.

FIFA World Cup 2022 : వాట్సాప్‌లో FIFA ఫుట్‌బాల్ వరల్డ్ కప్ స్టిక్కర్లు, GIF ఇమేజ్‌లు ఎలా పంపుకోవాలో తెలుసా?

ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం ఖలీఫా అంతర్జాతీయ స్టేడియంలో జపాన్ తొలిమ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో జర్మనీ జట్టుతో జపాన్ ఆటగాళ్లు తలపడ్డారు. హోరీహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో జపాన్ జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. ఈ విజయాన్ని జపాన్ అలభిమానులు రాత్రంతా పార్టీ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ వారు అలా చేయలేదు. ప్రపంచం మొత్తం వారివైపు చూసేలా తమ జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

మ్యాచ్ పూర్తయ్యాక స్టేడియంలోని స్టాండ్లు (ప్రేక్షకులు కూర్చొనే ప్రదేశం) ప్రేక్షకులు వదిలేసిన ఆహారపదార్థాలు, కాగితాలు, కూల్ డ్రింక్స్ బాటిళ్లు, ప్లేట్లతో నిండిపోవటం సర్వసాధారణమే. జపాన్ అభిమానులు రాత్రంతా స్టాండ్స్‌లోని చెత్తాచెదారాన్ని తొలగించేశారు. జపాన్ సంస్కృతిలో శుభ్రత ఒక భాగం. చిన్నతనం నుంచి ప్రజల్లో శుభత్రను అలవాటు చేసుకుంటారు. ఈ క్రమంలో వారు స్టేడియంలోని స్టాండ్లలో చెత్తను క్లీన్ చేసి అందరిచేత సూపర్ అనిపించుకున్నారు. జపాన్ ఫ్యాన్స్ చెత్తను తొలగిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. ‘జపాన్ జట్టు ఒకవేళ వరల్డ్ కప్ గెలవకపోయినా.. వారి అభిమానులు మాత్రం ఇప్పటికే విజేతలుగా నిలిచారంటూ’ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గతంలోనూ జపాన్ ఫ్యాన్స్ ఇలా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.