Jasprit Bumrah: ఇంగ్లాండ్ గడ్డపై మరో రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా

టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా మరో రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్ లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా ఘనత సాధించాడు.

Jasprit Bumrah: ఇంగ్లాండ్ గడ్డపై మరో రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా

 

 

Jasprit Bumrah: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా మరో రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్ లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా ఘనత సాధించాడు. గతేడాది మొదలై ప్రస్తుతం కొనసాగుతున్న ఐదు టెస్టుల మ్యా్ లో 21వికెట్లు పడగొట్టాడు. 2014లో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఆడిన భువనేశ్వర్ కుమార్ పేరిట 19వికెట్ల రికార్డ్ ఉండేది.

సెకండ్ ఇన్నింగ్స్ లో బుమ్రా ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. లెగ్ స్పిన్నర్ సుభాష్ గుప్తె 1959లో జరిగిన ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 17వికెట్లు తీశాడు.

ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
జస్పిత్ బుమ్రా – 2021/22 – 21 వికెట్లు
భువనేశ్వర్ కుమార్ – 2014 – 19 వికెట్లు
జహీర్ ఖాన్ – 2007 – 18 వికెట్లు
ఇషాంత్ శర్మ – 2018 – 18 వికెట్లు
సుభాష్ గుప్తె – 1959 – 17 వికెట్లు

Read Also: బ్రియాన్ లారా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా