Kane Williamson: కేన్ విలియమ్సన్ వీరబాదుడు.. సచిన్, సెహ్వాగ్ సరసన కివీస్ బ్యాటర్
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న మిలియమ్సన్ శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేశాడు.

Kane Williamson: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న మిలియమ్సన్ శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేశాడు. 296 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్ 215 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో టెస్టుల్లో ఆరోసారి డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్ గా సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ సరసన చేరాడు.
NZ vs SL 2nd Test: న్యూజిలాండ్ బ్యాటర్ల విజృంభణ.. విలియమ్సన్, నికోల్స్ డబుల్ సెంచరీల మోత ..
శ్రీలంకతో జరిగిన రెండోటెస్టు రెండోరోజు ఆటలో విలియమ్సన్, హెన్రీ నికోల్స్ ఇద్దరు డబుల్ సెంచరీలు చేశారు. మూడో వికెట్ కు వీరిద్దరు 363 భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒకే టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు డబుల్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. నికోల్స్ కు ఇది తొలి డబుల్ సెంచరీ కాగా, విలియమ్సన్ కు ఇది ఆరో డబుల్ సెంచరీ. తాజా డబుల్ సెంచరీతో విలియమ్సన్ రాహుల్ ద్రవిడ్ (5), జో రూట్ (5)ను అధిగమించాడు.
Kane Williamson’s 6th double century 🤩
Watch BLACKCAPS v Sri Lanka live and on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/U0Fu7NlHlB
— Spark Sport (@sparknzsport) March 18, 2023
సుదీర్ఘ ఫార్మాట్ లో అత్యధికంగా సర్ డాన్ బ్రాడ్ మన్ కేవలం 52 టెస్టుల్లోనే 12 ద్విశతకాలను సాధించాడు. టెస్టుల్లో ఆరు సార్లు డబుల్ సెంచరీలు చేసిన వారిలో విలియమ్సన్, సచిన్, సెహ్వాగ్ తో పాటు ఆటపట్టు (శ్రీలంక), జావీద్ మహ్మద్( పాకిస్థాన్), యూనిస్ ఖాన్ (పాకిస్థాన్), పాంటింగ్ (ఆసీస్) ఉన్నారు. ప్రస్తుతం 94వ టెస్టు ఆడుతున్న వియలిమ్సన్ తాజా డబుల్ సెంచరీతో 8వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. తన టెస్టు కెరీర్ లో ఆరు డబుల్ సెంచరీలు, 28 సెంచరీలు, 33 అర్థశతకాలు ఉన్నాయి.