KL Rahul : సెంచరీ బాదిన కేఎల్ రాహుల్.. సరికొత్త రికార్డులు నమోదు

సౌతాఫ్రికా గడ్డపై సెంచూరియన్ వేదికగా సఫారీ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేసిన రాహుల్..

KL Rahul : సెంచరీ బాదిన కేఎల్ రాహుల్.. సరికొత్త రికార్డులు నమోదు

Kl Rahul

KL Rahul : సౌతాఫ్రికా గడ్డపై సెంచూరియన్ వేదికగా సఫారీ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేసిన రాహుల్.. సెంచరీ బాదాడు. 219 బంతుల్లో శతకం అందుకున్నాడు రాహుల్‌. అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. బాక్సింగ్‌ డే రోజున (డిసెంబర్‌ 26) సెంచరీ మార్క్‌ అందుకున్న కేఎల్‌ రాహుల్‌కు టెస్ట్ కెరీర్ లో ఇది 7వ శతకం కాగా, విదేశీ గడ్డపై 5వ సెంచరీ. ఈ క్రమంలో టెస్టు ఓపెనర్‌గా పలు రికార్డుల బద్దలుకొట్టాడు రాహుల్.

* భారత జట్టు టెస్టు ఓపెనర్‌గా విదేశాల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో కేఎల్‌ రాహుల్‌ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో సునీల్‌ గావస్కర్ ‌(81 ఇన్నింగ్స్‌లో 12 సెంచరీలు) తొలి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో కేఎల్‌ రాహుల్‌ ( 34 ఇన్నింగ్స్‌లో 5 శతకాలు) ఉండడం విశేషం. ఇక మూడో స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ ‌(59 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు) ఉన్నాడు. వినూ మాన్కడ్‌ (19 ఇన్నింగ్స్‌లు), రవిశాస్త్రి (19 ఇన్నింగ్స్‌లు) మూడేసి సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నారు.

Union Bank of India Jobs : యూనియన్ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ వివరాలు

* సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన రెండో భారత ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌ నిలిచాడు. ఇంతకముందు వసీం జాఫర్‌ 2006-07లో కేప్‌టౌన్‌ టెస్ట్ లో సెంచరీ(116) బాదాడు.

* అలాగే టెస్టుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా గడ్డపై పర్యాటక జట్టు ఓపెనర్‌గా సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్ గా ఓవరాల్ గా మూడో ఆటగాడిగా కేఎల్‌ రాహుల్‌ నిలిచాడు. ఇంతకముందు సయీద్‌ అన్వర్‌ (పాకిస్తాన్‌), క్రిస్‌ గేల్ ‌(వెస్టిండీస్‌) మాత్రమే ఈ ఘనత సాధించారు.

* ఈ ఏడాది లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులోనూ 129 పరుగులు చేసిన రాహుల్‌కి.. 2021లో ఇది రెండో సెంచరీ. అలానే ఆసియా వెలుపల అత్యధిక సెంచరీలు నమోదు చేసిన భారత రెండో ఓపెనర్‌గా రాహుల్ నిలిచాడు. ఈ జాబితాలో గావస్కర్ 15 శతకాలతో ఉండగా.. రాహుల్ 5 సెంచరీలతో ఉన్నాడు.

సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ కొత్త చరిత్ర సృష్టించారు. తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి రికార్డు అందుకున్నారు. సఫారీల గడ్డపై ఇప్పటివరకు టీమిండియా 21 టెస్టులు ఆడగా.. రెండుసార్లు మాత్రమే ఓపెనర్లు వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగలిగారు.

Robo : రోబో సినిమా నిజం కానున్నదా?

తాజాగా కేఎల్‌ రాహుల్‌- మయాంక్‌ జోడి ముచ్చటగా మూడోసారి సెంచరీ భాగస్వామ్య ఫీట్‌ను నమోదు చేశారు. 2006-07 దక్షిణాఫ్రికా పర్యటనలో వసీం జాఫర్‌- దినేశ్‌ కార్తీక్‌ ఓపెనింగ్‌ జోడి (153 పరుగులు) తొలిసారి సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ తర్వాత 2010-11లో సెహ్వాగ్‌- గంభీర్‌ ద్వయం (137 పరుగులు) రెండోసారి సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఇప్పుడు రాహుల్-మయాంక్ ఆ ఘనత సాధించారు.