Dhoni retirement: ధోనీ వరల్డ్ రికార్డులు, 16 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

Dhoni retirement: ధోనీ వరల్డ్ రికార్డులు, 16 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

MS Dhoni 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు ఇచ్చేశాడు. మాజీ కెప్టెన్ ఆగష్టు 15 శనివారం సాయంత్రం 7గంటల 29నిమిషాలకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ధోనీ టెస్టు ఫార్మాట్ కు డిసెంబర్ 2014లోనే వీడ్కోలు పలికేశాడు. ఇక నేటితో అంతర్జాతీయ టోర్నీల్లో టీ20, వన్డే ఫార్మాట్లకు పలికేయడంతో ఇక దేశీవాలీ లీగ్ లలోనే కనిపించనున్నాడు. సెప్టెంబరు 19 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లలో మాత్రమే ఆడతాడు.

ధోనీ రిటైర్మెంట్ పై కొద్ది నెలల క్రితం నుంచే రూమర్లు వినిపించాయి. 2019లో న్యూజిలాండ్ తో మాంచెస్టర్ వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఒక్క మ్యాచ్ లోనూ కనిపంచలేదు. ఆల్ టైం గ్రేట్ కెప్టెన్లలో ధోనీ ఒకరు. కెప్టెన్సీలో మాత్రమే కాకుండా బ్యాటింగ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ ధోనీనే బెస్ట్.

కెప్టెన్ గా మూడు ఐసీసీ టోర్నమెంట్లు:
ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2007లో జరిగిన తొలి వరల్డ్ టీ20ని విజయంతో ఆరంభించాడు. అదే విజయాన్ని 2011లోనూ వన్డే వరల్డ్ కప్ సాధించి కొనసాగించాడు. ఆ తర్వాత 2013లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ సాధించి కెప్టెన్ గా మూడు ఐసీసీ టోర్నమెంట్లు సాధించిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు.

కెప్టెన్‌గా మోస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు:
ధోనీ కెప్టెన్ గా 332 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. 200వన్డేలు, 60 టెస్టులు, 72 టీ20లు ఆడి వరల్డ్ రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ 324 మ్యాచ్ లు ఆడగలిగాడు. అంతేకాకుండా ప్రతి ఫార్మాట్లోనూ 50 ఇంటర్నేషనల్ మ్యాచ్ ల కంటే ఎక్కువ లీడ్ చేసిన కెప్టెన్ కూడా ధోనీనే.

కెప్టెన్ గా ఎక్కువ విన్నింగ్ ముగింపులు
ధోనీ కెప్టెన్ గా 6 మల్టీ నేషన్ వన్డే టోర్నమెంట్ ఫైనల్స్ లో 4గెలుచుకుని మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అనిపించుకున్నాడు. మొత్తానికి ధోనీ వన్డే కెప్టెన్ గా 110వన్డే మ్యాచ్ లు.. గెలిచి రెండో కెప్టెన్ గా నిలిచాడు అతని కంటే ముందు 165వన్డేలు గెలిచి రిక్కీ పాంటింగ్ టాప్ స్థానంలో నిలిచాడు.

వన్డేల్లో అత్యధిక నాటౌట్ లు:
ధోనీ 84మ్యాచ్ లలో నాటౌట్ అవడంతో అన్‌బీటబుల్‌గా నిలిచాడు. ఇది కూడా వరల్డ్ రికార్డ్.