MS Dhoni: పాకిస్తాన్ పేసర్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన ఎంఎస్ ధోనీ

పాకిస్తాన్ ఫేసర్ హ్యారిస్ రవూఫ్ కు ఎంఎస్ ధోనీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని పాక్ బౌలర్ ట్విట్టర్ లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నారు.

MS Dhoni: పాకిస్తాన్ పేసర్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన ఎంఎస్ ధోనీ

Ms Dhoni

MS Dhoni: పాకిస్తాన్ పేసర్ హ్యారిస్ రవూఫ్ కు ఎంఎస్ ధోనీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని పాక్ బౌలర్ ట్విట్టర్ లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జెర్సీ నెంబర్ 7ను గిఫ్ట్ గా పంపించారంటూ అతను చాలా మంచివాడని పొగిడేస్తున్నాడు.

‘లెజెండ్ & కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ నాకు తన బ్యూటిఫుల్ షర్ట్ పంపించి సత్కరించారు. అతని మంచితనానికి, ఔన్నత్యానికి నిదర్శనమిది. ఈ సపోర్ట్ అందించిన రస్సెల్‌కు స్పెషల్ థ్యాంక్స్.

నిజానికి రవుఫ్ ఒక్కసారి కూడా ధోనీ ఉన్న మ్యాచ్ లో ఆడలేదు. కానీ, గతేడాది టీ29 వరల్డ్ కప్ సూపర్ 12 స్టేజి టైంలో ఒక్కసారి కలిశాడంతే. ఆ మ్యాచ్ లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇండియా పది వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై ఓడిపోయింది.

ఇది కూడా చదవండి : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ఆగష్టు 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ఐపీఎల్ 15వ సీజన్ లో చెన్నై కెప్టెన్ గా నడిపించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ధోనీ సీఎస్కే కెప్టెన్ గా రూ.12కోట్లు శాలరీ తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు రవూఫ్ ఆస్ట్రేలియా దేశీవాలీ లీగ్ అయిన బిగ్ బాష్ లీగ్ లో మెల్‌బౌర్న్ స్టార్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.