MS Dhoni : ధోనీ షాకింగ్ నిర్ణయం : చెన్నై కొత్త కెప్టెన్‌గా రవీంద్ర జడేజా

MS Dhoni : ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. సీఎస్‌కే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ధోనీ వెల్లడించాడు.

MS Dhoni : ధోనీ షాకింగ్ నిర్ణయం : చెన్నై కొత్త కెప్టెన్‌గా రవీంద్ర జడేజా

Ms Dhoni Steps Down As Csk Captain Ahead Of Start Of Ipl 2022, Ravindra Jadeja To Lead

MS Dhoni : ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. సీఎస్‌కే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ధోనీ వెల్లడించాడు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. 2008 నుంచి సీఎస్‌కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకూ చెన్నై జట్టుకు నాలుగు సార్లు ఐపీఎల్ కప్ అందించాడు ధోనీ. IPL 2022 టోర్నీ ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందు ధోనీ.. తన కెప్టెన్సీ హోదా నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. తన స్థానంలో సీఎస్కే పగ్గాలను రవీంద్ర జడేజాకు అప్పగించాడు.

శనివారం (మార్చి 26)న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సీఎస్కే తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్ ఓపెనర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ CSK జట్టుకు లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ ఆల్ రౌండర్ జడేజా నాయకత్వం వహించనున్నాడు. ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వాన్ని జడేజాకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. జట్టును ముందుకు నడిపించడంలో జడేజాను ఎంచుకున్నాడు. 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌లో అంతర్భాగంగా జడేజా కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహించే మూడవ ఆటగాడిగా జడేజా కొనసాగనున్నట్టు CSK అధికారిక ప్రకటనలో తెలిపింది.

ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ జట్టులో తన ఆటతో ప్రాతినిథ్యాన్ని కొనసాగించనున్నాడు. 2008లో ప్రారంభమైన IPL ఎడిషన్‌కు ముందు ధోనీ CSK కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ధోనీ తన సారథ్యంలో IPL రెండవ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా CSK జట్టుకు 4 టైటిళ్లను అందించాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత ధోనీ ఒక అడుగు దూరంలో ఉన్నాడు. చెన్నై జట్టు 15 ఏళ్ల టోర్నమెంట్ చరిత్రలో ధోని కెప్టెన్సీలో ఆల్ టైమ్ రికార్డులను నెలకొల్పిన సీఎస్కే.. అత్యంత విజయవంతమైన IPL ఫ్రాంచైజీగా అవతరించింది. కానీ, ప్లేఆఫ్‌లకు అర్హత సాధించడంలో చెన్నై జట్టు ఒకసారి మాత్రమే విఫలమైంది. ధోనీ, సురేశ్ రైనా తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మూడో ఆటగాడిగా జడేజా నిలిచాడు.రవీంద్ర జడేజా 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగంగా ఉన్నాడు. స్టార్ ఆల్ రౌండర్ శ్రీలంకతో జరిగిన మొహాలీ టెస్టులో 175 పరుగులు చేసి 9 వికెట్లు పడగొట్టి జడేజా చరిత్ర సృష్టించాడు.

Ms Dhoni Steps Down As Csk Captain Ahead Of Start Of Ipl 2022, Ravindra Jadeja To Lead (1)

Ms Dhoni Steps Down As Csk Captain Ahead Of Start Of Ipl 2022, Ravindra Jadeja To Lead 

2014లో ఎంఎస్ ధోనీ ఆస్ట్రేలియాలో ఒక సిరీస్ మధ్యలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించాడు. జనవరి 2017లో ధోని భారత పొట్టి ఫార్మాట్‌ల కెప్టెన్‌గా వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. MS ధోనీ అత్యుత్తమ పవర్-హిటర్‌, ఫినిషర్‌లలో ఒకడిగా పేరొంది. కొంతకాలంగా ధోనీ తన బ్యాట్ ఝుళిపించడంలో విఫలమవుతూ వస్తున్నాడు. IPL 2019లో 15 మ్యాచ్‌ల నుంచి 83.20 సగటుతో 416 పరుగులు చేశాడు. 2020లో 200 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

2021లో 114 పరుగులు చేశాడు. గత ఏడాది T20 ప్రపంచకప్‌లో MS ధోనీ మెంటార్‌గా ఎంపికయ్యాడు. అయితే భారత్ ఇప్పటికీ గ్రూప్ దశలను దాటలేకపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ బ్యాటింగ్ ఫామ్‌ తగ్గినప్పటికీ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. 2022లో IPL వేలానికి ముందు రవీంద్ర జడేజా తర్వాత కొనుగోలు చేసిన రెండవ CSK ఆటగాడిగా ధోని ఉన్నాడు. కెప్టెన్సీగా తప్పుకుంటున్నప్పటికీ ధోనీ నిస్సందేహంగా CSK థింక్-ట్యాంక్‌లో అంతర్భాగంగా ఉంటాడు. అలాగే కొత్త కెప్టెన్‌గా రవీంద్ర జడేజా ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది.

Read Also : MS Dhoni: జెర్సీ నెం.7 వెనుక అసలు కారణాన్ని చెప్పిన ధోనీ