రాష్ట్రపతి చేతుల మీదుగా క్రీడాకారులకు అవార్డులు

రాష్ట్రపతి చేతుల మీదుగా క్రీడాకారులకు అవార్డులు

2016 రియో పారాలింపిక్స్‌ రజత పతకం సాధించిన దీపా మలిక్‌‌కు అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డునిచ్చి సత్కరించారు. దీపాతో పాటు ఖేల్‌రత్నకు ఎంపికైన రెజ్లర్‌ భజరంగ్‌ పూనియా ప్రస్తుతం రష్యాలో ప్రాక్టీస్‌లో ఉండడంతో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరుకాలేకపోయాడు. 

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించిన సాయి ప్రణీత్‌‌కు అర్జున పురుస్కారం దక్కింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నాడు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. 

అర్జున అవార్డుకు నామినేట్ అయిన భారత ఆల్ రౌండర్ క్రికెటర్ రవీంద్రజడేజాతో మరి కొందరికి పురస్కారాలు అందుకోలేకపోయారు. రాయలసీమ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్డీటీ) రాష్ట్ర ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కార్‌ అవార్డును అందుకుంది. అనంతపురంలో ఆర్డీటీ 90 కేంద్రాల్లో పేద, మధ్య తరగతి వర్గ పిల్లలకు క్రీడల్లో శిక్షణ అందిస్తోంది. ఆర్డీటీ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కార్‌ను ప్రకటించింది.