Shreyas Iyer : మరోసారి షార్ట్ బాల్‌కు శ్రేయాస్ అయ్యర్ అవుట్.. సోషల్ మీడియాలో మీమ్స్.. మీరూ చూడండి..

12వ ఓవర్లో ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ వేసిన షార్ట్ ఆఫ్ లెంగ్త్ బంతిని శ్రేయాస్ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. అదికాస్త మిడాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న మార్క్ వుడ్ చేతికి చిక్కడంతో శ్రేయాస్ (4) ఔట్ అయ్యాడు.

Shreyas Iyer : మరోసారి షార్ట్ బాల్‌కు శ్రేయాస్ అయ్యర్ అవుట్.. సోషల్ మీడియాలో మీమ్స్.. మీరూ చూడండి..

Shreyas Iyer

Updated On : October 30, 2023 / 10:27 AM IST

ODI World Cup 2023 Shreyas Iyer: స్వ‌దేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా విజ‌య జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. ల‌క్నో వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 100 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌ళ్లీ అగ్ర‌స్థానానికి చేరుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ మరోసారి పరుగులు రాబట్టడంలో విఫలం అయ్యాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.

Also Read : IND vs ENG : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా విజ‌య యాత్ర‌.. ఇంగ్లాండ్ పై ఘ‌న విజ‌యం

టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ చేయగా.. రోహిత్, గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే, గిల్ (9) పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కోహ్లీసైతం డకౌట్ కావటంతో క్రీజులోకి శ్రేయాస్ అయ్యర్ వచ్చాడు. 12వ ఓవర్లో ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ వేసిన షార్ట్ ఆఫ్ లెంగ్త్ బంతిని శ్రేయాస్ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. అదికాస్త మిడాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న మార్క్ వుడ్ చేతికి చిక్కడంతో శ్రేయాస్ (4) ఔట్ అయ్యాడు.

 

శ్రేయాస్ షార్ట్ ఆఫ్ లెంగ్త్ బంతులకు అవుట్ కావటం పరిపాటిగా మారింది. వరల్డ్ కప్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో జరిగిన మ్యాచ్ లలోనూ శ్రేయాస్ ఇదే పద్దతిలో ఔట్ అయ్యాడు. వరుస మ్యాచ్ లలో షార్ట్ పిచ్ బంతులకు శ్రేయాస్ అయ్యర్ అవుట్ అవుతుండటంతో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పలువురు మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు.