FIFA World Cup 2022: ఉత్కంఠ పోరులో ఘనాపై విజయం సాధించిన పోర్చుగల్.. క్రిస్టియానో ​​రొనాల్డో కొత్త రికార్డు..

ఫిఫా (FIFA) వరల్డ్ కప్ 2022లో పోర్చుగల్ ఘనంగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో క్రిస్టియానో ​​రొనాల్డో, ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో ఘనాపై 3-2తో పోర్చుగల్ విజయం సాధించింది.

FIFA World Cup 2022: ఉత్కంఠ పోరులో ఘనాపై విజయం సాధించిన పోర్చుగల్.. క్రిస్టియానో ​​రొనాల్డో కొత్త రికార్డు..

FIFA WC 2022

FIFA World Cup 2022: ఫిఫా (FIFA) వరల్డ్ కప్ 2022లో పోర్చుగల్ ఘనంగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో క్రిస్టియానో ​​రొనాల్డో, ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో ఘనాపై 3-2తో పోర్చుగల్ విజయం సాధించింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో ఏ జట్టూ గోల్ చేయకపోయినప్పటికీ ద్వితీయార్థం మాత్రం ఉత్కంఠభరితంగా సాగింది.

FIFA World Cup 2022 : వాట్సాప్‌లో FIFA ఫుట్‌బాల్ వరల్డ్ కప్ స్టిక్కర్లు, GIF ఇమేజ్‌లు ఎలా పంపుకోవాలో తెలుసా?

మొదటి 10 నిమిషాల్లోనే పోర్చుగల్ వరుసగా మూడు సార్లు గోల్స్ కొట్టేందుకు ప్రయత్నించింది. రొనాల్డో తన అద్భుత ఆటతీరుతో ప్రత్యర్థి జట్టుకు ముచ్చమటలు పట్టించాడు. ఆట ప్రారంభమైన 13వ నిమిషంలో రొనాల్డో కార్నర్ కిక్‌ను హెడర్ ద్వారా గోల్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ అది గోల్ రూపంలోకి మారలేదు. అర్ధభాగం ముగిసే సమయానికి రొనాల్డో గోల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఫలితం కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ పూర్తిగా పోర్చుగల్ ఆధిపత్యం చెలాయించగా ఘనా జట్టు నుంచి గోల్ కోసం ప్రయత్నం జరగలేదు.

సెకండాఫ్‌లో తొలి 15 నిమిషాల్లో ఘనా అద్భుతంగా ఆడి పోర్చుగల్‌పై ఎదురుదాడికి దిగింది. 62వ నిమిషంలో ఘనా డిఫెన్స్‌ తప్పిదంతో పెనాల్టీ కార్నర్‌ను చేజార్చుకుంది. రొనాల్డో పెనాల్టీని గోల్‌గా మలిచి పోర్చుగల్‌ను 1-0తో ముందంజలో ఉంచాడు. 72వ నిమిషంలో కుడుస్‌ సహకారంతో కెప్టెన్‌ ఆండ్రీ అయెవ్ గోల్‌ కొట్టి స్కోరును సమం చేశాడు. ఆ తరువాత పోర్చుగల్ వరుసగా రెండు గోల్స్ చేసింది. 88వ నిమిషంలో ఉస్మాన్ బుకారీ హెడర్ ద్వారా గోల్ కొట్టి ఘనా స్కోరును 3-2తో ముగించాడు.

ఈ మ్యాచ్‌ పోర్చుగల్ విజయం సాధించడంతో పాటు ఆ జట్టు ఆటగాడు రొనాల్డో తన పేరిట రికార్డును కూడా నమోదు చేసుకున్నాడు. ఐదు వేర్వేరు ప్రపంచ కప్‌లలో గోల్స్ చేసిన ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా రొనాల్డో నిలిచాడు.