Ravi Teja : భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌.. తెలుగు క్రికెట్‌ లైవ్ కామెంటరీ ఇచ్చిన హీరో ర‌వితేజ‌

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భాగంగా భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డుతోంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఈ మ్యాచ్ జ‌రుగుతోంది.

Ravi Teja : భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌.. తెలుగు క్రికెట్‌ లైవ్ కామెంటరీ ఇచ్చిన హీరో ర‌వితేజ‌

Ravi Teja live commentary

Ravi Teja live commentary : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భాగంగా భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డుతోంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఈ మ్యాచ్ జ‌రుగుతోంది. వ‌ర‌ల్డ్ క‌ప్ టెవిలిజ‌న్ ప్ర‌సార హ‌క్కుల‌ను స్టార్ స్పోర్ట్స్ ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు క్రికెట్ లైవ్ షోలో మాస్ మ‌హారాజా ర‌వితేజ సంద‌డి చేశారు. కాసేపు క్రికెట్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. అభిమానుల‌తో ముచ్చ‌టించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే.. ర‌వితేజ న‌టించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా అక్టోబర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ర‌వితేజ తెలుగు క్రికెట్ లైవ్ కామెంట‌రీలో పాల్గొన్నాడు. టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ, హైద‌రాబాదీ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ అంటే ఇష్టమని చెప్పాడు.

Jake Fraser McGurk : 29 బంతుల్లో సెంచ‌రీ చేసిన ఆసీస్ బ్యాట‌ర్.. డివిలియ‌ర్స్ రికార్డు బ్రేక్‌

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై నూత‌న ద‌ర్శ‌కుడు వంశీ డైరెక్ష‌న్‌లో టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు తెర‌కెక్కింది. బాలీవుడ్ భామ‌లు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా న‌టించ‌గా.. రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీల‌క పాత్ర‌లు పోషించారు. జీవి ప్ర‌కాశ్ సంగీతాన్ని అందించ‌గా తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. పాన్ ఇండియా మార్కెట్ లో రవితేజకి ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో వేచి చూడాలి.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొద‌ట బ్యాటింగ్ ఎంచుకుంది. 35 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 5 వికెట్లు కోల్పోయి 138 ప‌రుగులు చేసింది. క్రీజులో మాక్స్‌వెల్ (14), కామెరూన్ గ్రీన్ (7)లు ఉన్నారు.