MS Dhoni: “జడేజాను సూపర్ కింగ్స్‌కు కెప్టెన్ చేయడం తప్పుడు నిర్ణయం”

చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను ఎంచుకోవడాన్ని తప్పుడు నిర్ణయమని వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైన చెన్నైకు పూర్తిగా ప్లేఆఫ్ ఆశలు కోల్పోయినట్లు అయింది.

MS Dhoni: “జడేజాను సూపర్ కింగ్స్‌కు కెప్టెన్ చేయడం తప్పుడు నిర్ణయం”

Ms Dhoni

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను ఎంచుకోవడాన్ని తప్పుడు నిర్ణయమని వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైన చెన్నైకు పూర్తిగా ప్లేఆఫ్ ఆశలు కోల్పోయినట్లు అయింది. 10జట్లు ఆడుతున్న IPL 2022లో ఇప్పటికే ఏడు ఓటములు ఎదుర్కొంది చెన్నై సూపర్ కింగ్స్.

ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. “సీజన్ ఆరంభంలో రవీంద్ర జడేజాను కెప్టెన్ చేయడమే ధోనీ చేసిన తప్పు. జడేజా కెప్టెన్ అయితే తర్వాతి సీజన్లకు కూడా అతనే కొనసాగాలి. అది చాలా తప్పు నిర్ణయం” అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

“సెటిల్డ్ ప్లేయింగ్ ఎలెవన్ లేకుండాపోయింది. రుతురాజ్ గైక్వాడ్ స్టార్టింగ్ లో పరుగులు చేయలేకపోయాడు. తర్వాతి మ్యాచ్‌లలో బాగానే ఆడుతున్నాడు. చివరి ఓవర్లో ధోనీ బౌండరీలు బాదాడు. ఆ గేమ్ దాదాపు ఓడిపోవాల్సింది. పేలవంగా ఆరంభించారు. సీజన్ ఆరంభం నుంచి బ్యాట్స్ మెన్ పేలవంగానే ఆడుతున్నారు. సీజన్ ఆరంభం నుంచి ధోనీయే కెప్టెన్ గా ఉంటే సీఎస్కే ఇన్ని మ్యాచ్ లలో వైఫల్యం చవిచూసేది కాదు” అని సెహ్వాగ్ చెప్పడం శోచనీయం.

Read Also : ధోనీ.. వాటే ఫినిష్.. ఉత్కంఠపోరులో చెన్నై విజయం.. ముంబైకి వరుసగా 7వ పరాజయం

బెంగళూరు నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ధోనీ సేన ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. దీంతో బెంగళూరు జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.