IND vs AUS : మూడో వన్డేకు ముందు రోహిత్ శర్మ ఆందోళన.. అందుబాటులో 13 మంది మాత్రమే..
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను టీమ్ఇండియా సొంతం చేసుకుంది. ఇక నామ మాత్రమైన చివరి వన్డే రాజ్‌కోట్ వేదికగా బుధవారం జరగనుంది.

Rohit Sharma
IND vs AUS 3rd ODI : మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను టీమ్ఇండియా సొంతం చేసుకుంది. ఇక నామ మాత్రమైన చివరి వన్డే రాజ్‌కోట్ వేదికగా బుధవారం జరగనుంది. అయితే.. వన్డే ప్రపంచకప్ ముందు టీమ్ఇండియా ఆడే చివరి వన్డే మ్యాచ్ ఇదే కావడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ మ్యాచ్‌పైనే ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌కు కేవలం 13 మంది ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. అనారోగ్యం, వ్యక్తిగత కారణాలతో చాలా మంది ఆటగాళ్లు చివరి వన్డేకు దూరం అయ్యారన్నాడు.
‘మా జట్టులో కొందరు అస్వస్థతకు గురయ్యారు. మరికొందరు వ్యక్తిగత కారణాలతో ఇళ్లకు వెళ్లారు. ప్రపంచకప్ నేపథ్యంలో కొందరికి రెస్ట్ ఇచ్చాం. దీంతో మూడో వన్డేకు 13 మంది ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు.’ అని మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్ తెలిపాడు. మొదటి రెండు వన్డేల్లో ఆడిన శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇచ్చామని, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, హార్దిక్ పాండ్య లు వ్యక్తిగత కారణాలతో తమ ఇళ్లకు వెళ్లారన్నాడు.
ప్రపంచకప్ జట్టులోకి అశ్విన్ రావొచ్చు..!
సీనియర్ ఆటగాడు అయిన రవిచంద్రన్ అశ్విన్ అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని రోహిత్ చెప్పాడు. అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, వేరియేషన్స్ చూపిస్తున్నాడన్నాడు. ఒకవేళ అవకాశం ఉంటే వన్డే ప్రపంచకప్‌కు అతడు జట్టులోకి రావొచ్చునని ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ హింట్ ఇచ్చాడు. ప్రపంచకప్ కు బ్యాకప్స్ కూడా సిద్ధంగా ఉండడం కలిసి వచ్చే అంశమన్నాడు.
Asian Games : ఈక్వస్ట్రియన్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. 41 ఏళ్ల తరువాత బంగారు పతకం
వన్డే ప్రపంచకప్ ముందు టీమ్ఇండియా నంబర్ వన్ ర్యాంకును అందుకోవడం సానుకూలాంశం అని రోహిత్ అన్నాడు. అయితే నంబర్ వన్ ట్యాగ్‌తో వచ్చే ఉపయోగాలు ఏం ఉండవన్నాడు. ప్రస్తుత కాలంలో మంచి క్రికెట్ ఆడితేనే విజయాలు వస్తాయని చెప్పాడు. తామెప్పుడు వర్తమానంపైనే దృష్టి కేంద్రీకరిస్తామన్నాడు. ర్యాంకులపై కాదన్నాడు.
అక్షర్ పటేల్ గాయంపై..
ఆసియాకప్‌లో సూపర్-4 దశలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. దీంతో ఆసీస్‌తో సిరీస్‌కు దూరం అయ్యాడు. దీనిపై రోహిత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అక్షర్ పటేల్ బెంగళూరులోని నేషన్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నట్లు చెప్పాడు. త్వరలోనే అక్షర్ జట్టుతో చేరుతాడని బావిస్తున్నట్లు చెప్పాడు. ఇక మెగా టోర్నీ నేపథ్యంలో రాబోయే కొన్ని వారాల పాటు ఆటగాళ్లు అనారోగ్యం, గాయాల బారిన పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని చెప్పాడు.
చరిత్ర సృష్టించే అవకాశం
టీమ్ఇండియా ముందు ప్రస్తుతం అద్భుత అవకాశం ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. అయితే.. చివరి వన్డేలో కూడా గెలిస్తే 3-0తో ఆస్ట్రేలియాను క్వీన్ స్వీప్ చేయొచ్చు. అదే గనుక జరిగితే భారత క్రికెట్లో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఆసీస్ ను క్లీన్ స్వీప్ చేసిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించొచ్చు. ప్రపంచకప్ ముందు ఇలా ఆస్ట్రేలియాను క్లీన్ స్వీప్ చేయడం వల్ల టీమ్ఇండియా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
Mushfiqur Rahim : విచిత్ర రీతిలో ఔటైన బంగ్లాదేశ్ బ్యాటర్.. వీడియో వైరల్