IPL 2023: హార్దిక్ పాండ్యా స్లెడ్జింగ్ ప్రయత్నాన్ని ఇలా విఫలం చేసిన సంజూ శాంసన్

IPL 2023: మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) తో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) ను ఎందుకు పోల్చుతున్నారు? మరోసారి ఆ పోలిక సరైందేనని ఎలా రుజువైంది?

IPL 2023: హార్దిక్ పాండ్యా స్లెడ్జింగ్ ప్రయత్నాన్ని ఇలా విఫలం చేసిన సంజూ శాంసన్

Photo Source: @CricketwithRosh

IPL 2023: క్రికెట్ ఆడే సమయంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఆటగాడు కూల్‌గా ఉంటే అతడిని మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) తో పోల్చుతుంటారు అభిమానులు. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) ను కూడా అతడి ఫ్యాన్స్ పదే పదే మహేంద్ర సింగ్ ధోనీతో పోల్చుతుంటారు. సంజూ శాంసన్ ని ధోనీతో పోల్చడం సరైందేనని నిన్నటి మ్యాచ్ లో నిరూపితమైంది.

డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో నిన్న జరిగిన మ్యాచులో సంజూ శాంసన్ (Sanju Samson) అద్భుతంగా ఆడి, తన టీమ్ ను గెలిపించుకున్న విషయం తెలిసిందే. అతడు 32 బంతుల్లో 6 సిక్స‌ర్లు,  3 ఫోర్ల సాయంతో 60 పరుగులు బాదాడు. ఓ పక్క బ్యాటింగ్ లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూనే మరో పక్క చాలా కూల్ గా కనపడ్డాడు.

ప్రత్యర్థి జట్టు కెప్టెన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, రెచ్చిపోకుండా, అసహనం తెచ్చుకోకుండా అతడు కనబర్చిన వైఖరి అదరహో అనిపించింది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (GT skipper Hardik Pandya) నిన్నటి మ్యాచులో సంజూ శాంసన్ వద్దకు వచ్చిన హార్దిక్ పాండ్యా ఆ సమయంలో స్లెడ్జింగ్ కు ప్రయత్నించినట్లు క్రికెట్ అభిమానులు కొందరు ఆరోపిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. క్రీజులో అద్భుతంగా ఆడుతున్న సంజూ శాసంన్ తో దురుసుగా వ్యవహరించేందుకు హార్దిక్ పాండ్యా ప్రయత్నించాడని చెబుతున్నారు. అయితే, అతడి ప్రభావానికి గురి కాకుండా సంజూ శాంసన్ దూరంగా వెళ్లిపోయాడు. ఇద్దరి మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకోకుండా స్థితప్రజ్ఞతను కనబర్చాడు.

అనంతరం సంజూ శాంసన్ బ్యాట్ తో సమాధానం చెప్పాడు. అంటే, విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) గెలుపులో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్ పాండ్యా స్లెడ్జింగ్ ప్రయత్నాన్ని ఇలా విఫలం చేసిన సంజూ శాంసన్ ను అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు.

IPL 2023, GT Vs RR: గుజ‌రాత్ టైటాన్స్ పై రాజ‌స్థాన్ విజ‌యం