T20 World Cup 2021: షోయబ్ అక్తర్ కు తీరని అవమానం… లైవ్ షో నుంచి పంపేసిన టీవీ హోస్ట్

సోషల్ మీడియాల్లోనూ, టీవీ వేదికగానూ తన అభిప్రాయాలను బయటపెట్టే పాకిస్తాన్ మాజీ ఫేసర్ షోయబ్‌ అక్తర్‌కు తీరని అవమానం జరిగింది.

T20 World Cup 2021: షోయబ్ అక్తర్ కు తీరని అవమానం… లైవ్ షో నుంచి పంపేసిన టీవీ హోస్ట్

Shoib Akthar

T20 World Cup 2021: సోషల్ మీడియాల్లోనూ, టీవీ వేదికగానూ తన అభిప్రాయాలను బయటపెట్టే పాకిస్తాన్ మాజీ ఫేసర్ షోయబ్‌ అక్తర్‌కు తీరని అవమానం జరిగింది. న్యూజిలాండ్ జట్టుపై పాకిస్తాన్ విజయం సాధించిన తర్వాత జరిగిన లైవ్ టీవీషోలో మాట్లాడేందుకు వచ్చిన అక్తర్ ను బయటకు వెళ్లిపొమ్మన్నారు. మారుమాట్లాడలేదు. క్రికెట్‌ విశ్లేషకుడిగా ఆ టీవీ ఛానల్‌తో తనకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని బయటకు వచ్చేశాడు.

అసలేం జరిగిందంటే..
టీ 20 వరల్డ్‌ కప్‌లో భాగంగా మంగళవారం పాక్ మరో విజయాన్ని నమోదు చేస్తూ.. కివీస్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. పాక్‌ బౌలర్‌ హ్యారిస్ రవూఫ్ నాలుగు వికెట్లతో కివీస్‌ పతనంలో కీలకపాత్ర పోషించాడు. పాక్- న్యూజిలాండ్ మ్యాచ్ గురించి జరిగిన విశ్లేషణాత్మకమైన టీవీషో పీటీవీ స్పోర్ట్స్‌ హోస్ట్‌ ఆధ్వర్యంలో జరిగింది.

డాక్టర్‌ నౌమన్‌ నియాజ్‌ హోస్ట్‌గా వ్యవహరించగా.. వివియన్‌ రిచర్డ్స్‌, డేవిగ్‌ గోవర్‌, రషీద్‌ లతీఫ్‌, ఉమర్‌ గుల్‌, అకిబ్‌ జావేద్‌, పాక్‌ మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సనా మీర్‌ లతో పాటు షోయబ్ అక్తర్ పాల్గొన్నారు.

మ్యాచ్‌ గురించి మాట్లాడుతూనే అక్తర్‌ పాక్‌ బౌలర్లు హ్యారిస్ రవూఫ్‌, షాహిన్‌ అఫ్రీదీ వారి కోచ్‌లపై ప్రశంసలు కురిపించాడు. హోస్ట్‌ నౌమన్ నియాజ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలని.. ఇతర విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని వారించాడు.

…………………………………………. : మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు..

‘మీరు చాలా మాట్లాడుతున్నారు. ఇది నచ్చడం లేదు. అతి తెలివిగా మాట్లాడాలనుకుంటే షో నుంచి వెళ్లిపోండి’ అని అన్నాడు. ఆ మాటతో అక్తర్‌ తన మైక్రోఫోన్‌ను అక్కడే వదిలేసి బయటకు వెళ్లిపోయాడు. కనీసం తనను ఆపే ప్రయత్నం కూడా చేయకపోవడంతో టీవీ ఛానెల్ తో తనకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. అదే షోకు వచ్చిన మిగతా ప్రముఖులు ఘటనతో షాక్ అయ్యారు.

దీనిపై అక్తర్ సోషల్ మీడియాలో తన రెస్పాన్స్ వెల్లడించాడు. లైవ్‌ మధ్యలోనే బయటకు వెళ్లిపొమ్మని హెచ్చరించారు. వివియన్‌ రిచర్డ్స్‌, డేవిగ్‌ గోవర్‌ లాంటి దిగ్గజాలు, సమకాలీన క్రికెటర్లతో పాటు మిలియన్ల మంది చూస్తుండగా నాతో అమర్యాదగా ప్రవర్తించడం నాకెంతో ఇబ్బందికరంగా అనిపించింది. సమస్యను సానుకూలంగా పరిష్కరించుకుందామని ఆశించా’ అని రాసుకొచ్చాడు.