Suresh Raina: సురేశ్ రైనా ఆత్మకథ రిలీజ్ అయ్యేది మే 24నే

టీమిండియా మాజీ క్రికెటర్, చిన్న తలా సురేశ్ రైనా తన క్రికెట్ కెరీర్ ను మే24న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. Believe అనే పేరు ఉన్న ఆత్మకథను

Suresh Raina: సురేశ్ రైనా ఆత్మకథ రిలీజ్ అయ్యేది మే 24నే

Suresh Raina

Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్, చిన్న తలా సురేశ్ రైనా తన క్రికెట్ కెరీర్ ను మే24న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. Believe అనే పేరు ఉన్న ఆత్మకథను సీనియర్ క్రికెట్ జర్నలిస్ట్ భరత్ సుందరేశన్ తో కలిసి బుక్ రెడీ చేస్తున్నారు. దీనిని పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ పబ్లిష్ చేస్తుంది.

చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న రైనా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడుు. కొవిడ్ 19 కారణంగా టోర్నమెంట్ మధ్యలో రద్దు అయింది. 2005లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో టీమిండియాలోకి అరంగ్రేటం చేశాడు రైనా. టీమిండియాలో సాధించిన పేరు కంటే ఐపీఎల్ లోనే ఎక్కువ అభిమానులను సంపాదించుకున్నాడు.

సీఎస్కే తరపున సూపర్ బ్యాట్స్ మెన్ గా పేరొంది చిన్న తలా అని పిలిపించుకుంటున్నాడు. కొద్ది రోజుల ముందు టోర్నమెంట్ క్యాన్సిలేషన్ గురించి రైనా ఇది జోక్ ఎప్పటికీ కాదని కలిసి పోరాడితేనే గెలవగలమని చెప్పారు.

ఇది జోక్ ఎప్పటికీ కాదు. చాలా మంది ప్రాణాలు, నిస్సహాయంగా మగ్గుతున్నాయి. ఎంత సహాయం కావాలో ఏం చేయాలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. వనరుల్లేక సతమతమవుతున్నారు. దేశంలో ప్రతి ఒక్కరు ఇంకొకరికి సపోర్ట్ గా నిలబడాలి అంటూ ట్వీట్ చేశాడు.