ఫోన్ స్విచాఫ్ చేస్తే మంచిది టీమిండియా క్రికెటర్లకు కైఫ్ సూచన

ఫోన్ స్విచాఫ్ చేస్తే మంచిది టీమిండియా క్రికెటర్లకు కైఫ్ సూచన

switch off the phones kaif to team india : ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘోరంగా విఫలం చెందడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత జట్టు క్రీడాకారులు కూడా తప్పుబడుతున్నారు. ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ సేన…కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందించారు. టీమిండియా ఆటగాళ్లు ముందు తమ ఫోన్లు స్విచాఫ్ చేసుకోవాలని సూచించారు. బయట ఏం మాట్లాడుకున్నా…పట్టించుకోకపోవడమే మంచిదని తెలిపారు. కలిసికట్టుగా బృందంగా పనిచేసి జరగాల్సిన దానిపై దృష్టి సారించాలని, దారుణ పరాజయం నుంచి బయటపడడం తక్షణ కర్తవ్యమని తెలిపారు.

ఇక రాబోయే టెస్టు మ్యాచ్‌ల్లో టీమిండియాకు నాయకత్వం వహించే అజింక్య రహానే జట్టును ఏకతాటిపై నిలపాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు కైఫ్. నెక్ట్స్ మ్యాచ్‌లో ఎలా రాణించాలనే అంశంపై కాన్స్ ట్రేషన్ చేయండన్నారు.
అడిలైడ్ డే నైట్ టెస్టులో 2020, డిసెంబర్ 19వ తేదీన కోహ్లీ సేన దారుణంగా విఫలమైంది. కోహ్లీ కెప్టెన్సీలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఆసీస్ బౌలర్స్ వుడ్, కమిన్స్ బౌలింగ్ ధాటికి 36 రన్స్‌కు కుప్పకూలి టెస్టుల్లో లోయెస్ట్ స్కోరు చేసింది. 1974లో లార్డ్స్ వేదికగా..ఇంగ్లండ్‌పై టీమిండియా చేసిన 42 రన్స్ స్కోరును బీట్ చేసింది.