IPL 2021: ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ వీళ్లే

లీగ్‌లో ఆడుతున్న బ్యాట్స్‌మెన్ మరోసారి బ్యాటింగ్‌లో తమ జోరును చూపించేందుకు సిద్ధం అవుతున్నారు.

IPL 2021: ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ వీళ్లే

2021

most sixes in IPL: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను అభిమానించే ఎంతోమంది.. ఎదురు చూస్తున్న ఐపీఎల్ వినోదం పంచేందుకు సిద్దం అయింది. రేపటి నుంచి అంటే ఏప్రిల్ 9వ తేదీన చెన్నైలోని చిదంబరం స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమై ఆహ్లాదం పంచనుంది. ఈ లీగ్‌లో ఆడుతున్న బ్యాట్స్‌మెన్ మరోసారి బ్యాటింగ్‌లో తమ జోరును చూపించేందుకు సిద్ధం అవుతున్నారు. బిగ్ షాట్స్ ఆడుతూ.. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోవడమే.. దనాదన్ క్రికెట్ అతిపెద్ద లక్షణం.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు కొట్టడం గురించి మాట్లాడితే, క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్. క్రిస్ గేల్ ఇప్పటివరకు 132మ్యాచ్‌లలో 349 సిక్సర్లు బాదాడు. ఇది ఇప్పటివరకు ఉన్న రికార్డు. గరిష్ట సిక్సర్ల పరంగా ఎబి డివిలియర్స్ రెండవ స్థానంలో ఉన్నాడు. మొత్తం 169మ్యాచ్‌లలో 235 సిక్సర్లు కొట్టాడు, తర్వాతి స్థానాల్లో వరుసగా.. ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. ధోనీ 204మ్యాచ్‌లలో 216 సిక్స్‌లు బాదగా.. రోహిత్ శర్మ 200మ్యాచ్‌లలో 213సిక్సర్లు బాదాడు. విరాట్ కోహ్లీ 192మ్యాచ్‌లలో 201సిక్సర్లు కొట్టాడు.

తర్వాతి స్థానంలోఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ కిరోన్ పొలార్డ్ 198 సిక్సర్లు కొట్టాడు. డేవిడ్ వార్నర్ 142మ్యాచ్‌లలో 195 సిక్సర్లు సాధించగా.. సురేష్ రైనా, షేన్ వాట్సన్, రాబిన్ ఊతప్ప.. ఇలా వరుసగా.. టాప్ టెన్ లిస్ట్‌లో ఉన్నారు.

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్లు:

క్రిస్ గేల్ – 349 సిక్సర్లు
ఏబీ డివిలియర్స్- 235సిక్సర్లు
మహేంద్ర సింగ్ ధోని – 216 సిక్సర్లు
రోహిత్ శర్మ- 213సిక్సర్లు
విరాట్ కోహ్లీ-201సిక్సర్లు
కిరోన్ పొలార్డ్- 198 సిక్సర్లు
డేవిడ్ వార్నర్ – 195 సిక్సర్లు
సురేష్ రైనా- 194సిక్సర్లు
షేన్ వాట్సన్- 194సిక్సర్లు
రాబిన్ ఊతప్ప- 163సిక్సర్లు