Virat Kohli : బాంబ్ పేల్చిన విరాట్.. గంగూలీపై సంచలన కామెంట్

బీసీసీఐ నుంచి తాను ఎటువంటి కమ్యూనికేషన్ పొందలేదని చెప్పిన కోహ్లీ.. గంగూలీ కామెంట్స్ ను ఖండించినట్టయింది. 

Virat Kohli : బాంబ్ పేల్చిన విరాట్.. గంగూలీపై సంచలన కామెంట్

Kohli

Virat Kohli : కెప్టెన్సీ మార్పులు, బీసీసీఐ తీరుపై టీమిండియా టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాంబ్ పేల్చాడు. సౌతాఫ్రికాతో భారత్ సిరీస్ కు ముందు టీమిండియాలో జరిగిన హాట్ హాట్ పరిణామాలు… తాజాగా కోహ్లీ చేసిన కామెంట్స్ తో మరింత హీటెక్కాయి. టీ 20, వన్డే కెప్టెన్సీ పగ్గాలను గత వారం రోహిత్ శర్మకు అప్పగించడంపై చెలరేగుతున్న వివాదాలు.. విరాట్ కోహ్లీ చేసిన లేటెస్ట్ కామెంట్స్ తో మరింత ముదిరాయి. తాను చెప్పినా వినకుండా విరాట్ కోహ్లీ టీ20 పగ్గాలు వదులుకున్నాడన్న బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కామెంట్స్ ను విరాట్ కోహ్లీ ఖండించడం సంచలనం రేపుతోంది.

బుధవారం(డిసెంబర్ 15, 2021)నాడు మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. సౌతాఫ్రికాతో సిరీస్‌లకు సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ లో బీసీసీఐకి, తనకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ను హైలైట్ చేశాడు. భారత వన్డే జట్టు కెప్టెన్ గా తనను తొలగించడంపై సెలెక్టర్ల నుంచి ముందస్తుగా ఎటువంటి సమాచారం రాలేదని బాంబ్ పేల్చాడు.

Read Also : Virat Kohli: ‘కోహ్లీ ఫోన్ స్విచాఫ్ ఉంది.. గంగూలీ స్టేట్మెంట్ ఆశ్చర్యంగా అనిపిస్తుంది’

డిసెంబర్ 8న సెలెక్షన్ మీటింగ్ కు కేవలం గంటన్నర ముందు మాత్రమే తనను కాంటాక్ట్ అయ్యారన్నాడు కోహ్లీ. “నాకు సమాచారం ఇచ్చారు అని జరుగుతున్న ప్రచారం సరైనది కాదు. టెస్ట్ సిరీస్ సెలెక్షన్ మీటింగ్ కు గంటన్నర ముందు మాత్రమే నన్ను కాంటాక్ట్ అయ్యారు. మీటింగ్ అయ్యాక… నేను వన్డే కెప్టెన్ కాదు అని ఐదుగురు సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే నాకు ఫోన్ చేసి చెప్పారు. ఓకే ఫైన్ అని వాళ్లకు ఫోన్ లో రిప్లై ఇచ్చాను.” అని కోహ్లీ ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ఐతే.. వన్డే సిరీస్ కు దూరంగా ఉంటాడన్న వదంతులకు బ్రేక్ వేశాడు కోహ్లీ. సెలెక్టర్లకు, BCCIకి తాను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని.. రోహిత్ శర్మకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నాడు.

Read Also :Ganguly on Kohli: కోహ్లీతో మాట్లాడాం.. ఆ తర్వాతే తొలగించాం!

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవలే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ కెప్టెన్సీ గురించి స్పందించాడు. లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్ లో ఇద్దరు కెప్టెన్లు ఉండాలని సెలెక్టర్లు భావించడం లేదని.. ఐతే… టీ20 కెప్టెన్సీని మాత్రం వదులుకోవద్దని తాను కోహ్లీతో చెప్పానని సౌరవ్ గంగూలీ ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. బీసీసీఐ నుంచి తాను ఎటువంటి కమ్యూనికేషన్ పొందలేదని చెప్పిన కోహ్లీ.. గంగూలీ కామెంట్స్ ను ఖండించినట్టయింది.

Read Also : Virat Kohli: వన్డే కెప్టెన్‌గా కోహ్లీని పక్కకుబెట్టి రోహిత్‌ను తీసుకోవాలని బీసీసీఐ ప్లాన్!!

మరోవైపు.. టీ20కెప్టెన్సీ వదులుకున్నప్పుడు.. బీసీసీఐ ఆ నిర్ణయాన్ని వెల్కమ్ చేసిందన్నాడు విరాట్ కోహ్లీ. తనను ఎవరూ కాదనలేదని.. నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పలేదన్నాడు. ప్రోగ్రెసివ్ నిర్ణయం తీసుకున్నానని మాత్రమే కొందరు అభిప్రాయపడ్డట్టుగా కోహ్లీ చెప్పాడు.

గంగూలీ కామెంట్స్ ను ఖండించిన కోహ్లీ.. రోహిత్ శర్మ కెప్టెన్సీకి మద్దతు పలికాడు. మరోవైపు… సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు కూడా అందుబాటులో ఉంటానని క్లారిటీ ఇచ్చాడు. డిసెంబర్ 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 23 వరకు 4 వేదికల్లో సౌతాఫ్రికాలో టెస్ట్, వన్డే సిరీస్ జరగనుంది. రాబోయే 3 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు రోహిత్ శర్మ గాయంతో దూరమయ్యాడు.

Read Also : BCCI on Kohli: వన్డే సిరీస్ లో కోహ్లీ ఆడతాడు: బీసీసీఐ