Virat Kohli: కొత్త హెయిర్ స్టైల్‌తో విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌కు ముందు అదిరే మేకోవర్.. హెయిర్ స్టైలిష్ట్ ఎవరో తెలుసా..

ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని కోహ్లీ తన మేకోవర్ కోసం కేటాయించాడు. తాజా హెయిర్ స్టైల్ యువతను, ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కొత్త రకం హెయిర్ స్టైల్‌తో కోహ్లీ మరింత మంచి లుక్‌తో కనిపిస్తున్నాడు. తాజా లుక్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Virat Kohli: కొత్త హెయిర్ స్టైల్‌తో విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌కు ముందు అదిరే మేకోవర్.. హెయిర్ స్టైలిష్ట్ ఎవరో తెలుసా..

Virat Kohli: భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అదిరే హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని కోహ్లీ తన మేకోవర్ కోసం కేటాయించాడు. తాజా హెయిర్ స్టైల్ యువతను, ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కొత్త రకం హెయిర్ స్టైల్‌తో కోహ్లీ మరింత మంచి లుక్‌తో కనిపిస్తున్నాడు.

Rains In Telangana: శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

కోహ్లీకి అతడి ఆటతీరు వల్లే కాకుండా.. అతడి స్టైల్ వల్ల కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడూ ఫిట్‌గా ఉంటూ, మంచి లుక్ మెయింటైన్ చేస్తుంటాడు. అందుకే అతడి స్టైల్‌ను ఫ్యాన్స్ కూడా ఫాలో అవుతారు. ఇదే కోవలో తాజా లుక్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ కోహ్లీకి హెయిర్ స్టైలింగ్ చేసింది ఎవరో తెలుసా..? సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ ఆలిం హకీం. ఇండియలోని టాప్ సెలబ్రిటీలకు అతడే హెయిర్ స్టైలింగ్ చేస్తుంటాడు. టాలీవుడ్‌కు సంబంధించి రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌కు కూడా అతడే హెయిర్ స్టైలింగ్ చేస్తుంటాడు. అతడి ఫీజు లక్షల్లో ఉంటుంది. కోహ్లీ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలను అతడే తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.

Viral Video: ప్రేక్షకులకు షాకిస్తున్న సీరియల్స్.. ఈ సీన్ చూస్తే హడలే… ఏకంగా తాడుతో చంద్రుడ్నే కిందకు లాగారు..!

దీంతో ఫ్యాన్స్ అతడికి థాంక్స్ చెబుతున్నారు. ప్రస్తుతం కొత్త మేకోవర్‌తో ఆకట్టుకుంటున్న కోహ్లీ మరో వారంలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి కోహ్లీ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గత సీజన్లలో కోహ్లీ టీమ్ వరుస పరాజయాలతో అభిమానుల్ని నిరశపరిచింది. దీంతో ఈసారైనా కోహ్లీ టీమ్ ఆర్సీబీ అంచనాలకు తగ్గట్లు రాణిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.