Virat Kohli: చిన్ననాటి ఫొటోలోని స్టైల్‌ను రీక్రియేట్ చేస్తూ పోజులిచ్చిన విరాట్ కోహ్లీ.. ఫొటోలు వైరల్

మైదానంలో అయినా, బయట అయినా అభిమానులు విరాట్ కోహ్లీ ప్రతి కార్యకలాపాన్ని గమనిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో పలు వీడియోలు, చిత్రాలు వైరల్ కావడం సర్వసాధారణం.

Virat Kohli: చిన్ననాటి ఫొటోలోని స్టైల్‌ను రీక్రియేట్ చేస్తూ పోజులిచ్చిన విరాట్ కోహ్లీ.. ఫొటోలు వైరల్

Virat Kohli

Updated On : September 27, 2023 / 10:27 AM IST

Virat Kohli Recreates His Childhood Photo: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒకరు. అసాధారణమైన ప్రతిభ, స్థిరమైన ఆటతీరుతో పరుగుల వరదపారిస్తూ ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీ అభిమానులను సంపాదించుకున్నారు. విరాట్ కోహ్లీ మైదానంలో ఉన్నాడంటే తన దూకుడు ఆటతీరుతో ప్రత్యర్థి జట్టు శిభిరంలో ఆందోళన రేపుతాడు. మరోవైపు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలోనూ కోహ్లీ యాక్టివ్‌గా ఉంటాడు. భారత్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా కోహ్లీ ఘనత సాధించాడు. ఎక్స్ (ట్విటర్), ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో ఎప్పటికప్పుడు వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తుంటాడు.

Read Also: Asian Games: ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నేపాల్ క్రికెట్ జట్టు.. యువరాజ్, రోహిత్ రికార్డులు బద్దలు

మైదానంలో అయినా, బయట అయినా అభిమానులు విరాట్ కోహ్లీ ప్రతి కార్యకలాపాన్ని గమనిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో పలు వీడియోలు, చిత్రాలు వైరల్ కావడం సర్వసాధారణం. ఇటీవల కోహ్లీ తన చిన్ననాటి ఫొటోల్లోని భంగిమలకు ప్రస్తుతం అచ్చం అదేవిధంగా పోజులిస్తూ ఫొటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ యాడ్ షూటింగ్ కోసం కోహ్లీ తన చిన్ననాటి ఫొటోలను రిక్రియేట్ చేస్తూ ప్రస్తుతం అదే తరహా పోజులిచ్చాడు.