Virat Kohli: ధోనీ రిటైర్మెంట్ తెలిశాక కోహ్లీ కన్నీరు.. ‘ఆ రోజు ఇంకా గుర్తుంది’

ఎంఎస్ ధోనీ బొటనవేలి గాయం కారణంగా తొలిసారి 2014లో అడిలైడ్ వేదికగా టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కోహ్లీకి అదే శాశ్వత కెప్టెన్సీకి నాంది అని ఊహించలేదు.

Virat Kohli: ధోనీ రిటైర్మెంట్ తెలిశాక కోహ్లీ కన్నీరు.. ‘ఆ రోజు ఇంకా గుర్తుంది’

Virat Kohli

Virat Kohli: వారం రోజుల క్రితం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తో అంతర్జాతీయ క్రికెట్ లో ఓ షాక్. 68టెస్టు మ్యాచ్ లలో 40 విజయాలు, ఏడేళ్లుగా టెస్టు కెప్టెన్సీని కొనసాగిస్తూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్(ఒక్క టెస్టు మినహాయించి), వెస్టిండీస్, శ్రీలంకలలో సాధించిన విజయాలు కోహ్లీ స్థాయిని పెంచేశాయి. ఎంఎస్ ధోనీ బొటనవేలి గాయం కారణంగా తొలిసారి 2014లో అడిలైడ్ వేదికగా టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కోహ్లీకి అదే శాశ్వత కెప్టెన్సీకి నాంది అని ఊహించలేదు.

అదే సిరీస్ లో మూడో టెస్ట్ మ్యాచ్ తర్వాత టెస్టు క్రికెట్ నుంచి ధోనీ రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా ఈ సుదీర్ఘ ఫార్మాట్ కు పర్మినెంట్ గా కోహ్లీని చేయాలంటూ పేరును ప్రతిపాదించాడు. ఈ విషయాన్ని 2015లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ వెల్లడించాడు. తాను రెడ్ బాల్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పేస్తున్నాననగానే తాను కన్నీటి పర్యంతమయ్యానని వివరించాడు.

‘నిజంగా టెస్టు కెప్టెన్ అవుతానని ఇప్పటివరకూ అనుకోలేదు. ఆ విషయం తెలిసిన కాసేపటికి రూంకు వెళ్లి అనుష్కకు చెప్పా. ఇంత సడెన్ గా ఎలా జరిగింది. ధోనీ ఎందుకిలా చేశాడని ఆమె కూడా ఫీల్ అయింది. అలా కాసేపటి తర్వాత నేను టెస్టు కెప్టెన్ ఆఫ్ ఇండియా అయ్యాను. ఒకట్రెండు మ్యాచ్ లు కాదు. శాశ్వత కెప్టెన్ గా ఎంపికయ్యా. ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు కూడా’ అని గుర్తు చేసుకున్నాడు కోహ్లీ.

ఇది కూడా చదవండి: క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న ముఠా అరెస్ట్

ప్రస్తుతం టెస్టు ఫార్మాట్ కు కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ తలమునకలవుతోంది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రాలలో ఎవరికైనా కట్టబెడతారా.. యువ క్రికెటర్ రిషబ్ పంత్ కు అప్పగిస్తారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.