Virat Kohli: 10వ తరగతి మార్కుల షీటును పోస్ట్ చేసిన కోహ్లీ.. కామెంట్ అదుర్స్

మార్కుల షీట్లో కోహ్లీకి ఇంగ్లిష్ లో 83, హిందీలో 75, గణితంలో 51, సైన్స్ లో 55, సోషల్ సైన్స్ లో 81, ఇంట్రొడక్టరీలో I Tలో 74 మార్కులు వచ్చాయి. ఆయా సబ్జెక్టుల కింద "స్పోర్ట్స్?" అని కోహ్లీ రాసుకున్నాడు.

Virat Kohli: 10వ తరగతి మార్కుల షీటును పోస్ట్ చేసిన కోహ్లీ.. కామెంట్ అదుర్స్

Virat Kohli

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇవాళ తన 10వ తరగతి మార్కుల షీట్ ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. మార్కుల షీట్లో ప్రాధాన్యంలేని విధంగా, అత్యల్పంగా చూసే విషయమైన క్రీడలే.. క్యారెక్టర్ లో మాత్రం అత్యున్నంగా కనపడతాయని, చాలా ఫన్నీగా ఉందని పేర్కొన్నాడు. క్రీడలను కూడా సబ్జెక్ట్ లా ఉండనివ్వాలంటూ #LetThereBeSport హ్యాష్ ట్యాగ్ తో కోహ్లీ కూలో పోస్ట్ చేశాడు. 

మార్కుల షీట్లో కోహ్లీకి ఇంగ్లిష్ లో 83, హిందీలో 75, గణితంలో 51, సైన్స్ లో 55, సోషల్ సైన్స్ లో 81, ఇంట్రొడక్టరీ I Tలో 74 మార్కులు వచ్చాయి. ఆయా సబ్జెక్టుల కింద “స్పోర్ట్స్?” అని కోహ్లీ రాసుకున్నాడు. అసలు క్రీడలు అనే విషయానికి బడిలో మార్కుల షీట్లో ప్రాధాన్యం ఇవ్వలేదని, తన జీవితంలో మాత్రం అదే తనకు పేరు తెచ్చిందనేలా కోహ్లీ వ్యాఖ్యలు చేశాడు.

కాగా, చాలా కాలం తర్వాత ఇటీవలే టెస్టుల్లో సెంచరీ చేసి జోరు మీదున్న కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్-2023 సీజన్ కు సిద్ధమవుతున్నాడు. వరుసగా 16వ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. అందులో 2008లో 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కోహ్లీ చేరాడు. కోహ్లీ చేసిన ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవడానికి, మనం చదివిన చదువులకు సంబంధమే లేకుండా పోతోందని నెటిజన్లు కామెంట్లు చేశారు.

Koo App

IPL-2023: విరాట్ కోహ్లీ గురించి ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు