Hardik Pandya: హార్దిక్ పాండ్యా మరికొందరు మద్యం మత్తులో బలవంతం చేశారు – రియాజ్ భటి భార్య

దావూద్ ఇబ్రహీంకు అనుచరుడిగా ప్రచారంలో ఉన్న రియాజ్ భటి భార్య రేణుమా భటి.. తన భర్త ఇతర హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులతో సెక్స్ చేయాలని....

Hardik Pandya: హార్దిక్ పాండ్యా మరికొందరు మద్యం మత్తులో బలవంతం చేశారు – రియాజ్ భటి భార్య

Hardik Pandya

Hardik Pandya: దావూద్ ఇబ్రహీంకు అనుచరుడిగా ప్రచారంలో ఉన్న రియాజ్ భటి భార్య రేణుమా భటి.. తన భర్త  హార్దిక్ పాండ్యా మరికొందరు వ్యక్తులతో సెక్స్ చేయాలని బలవంతం చేశాడంటూ ఆరోపణలు చేశారు. ముంబైలోని శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 24న క్రికెటర్స్ మునాఫ్ పటేల్, హార్దిక్ పాండ్యా, కాంగ్రెస్ లీడర్ రాజీవ్ శుక్లా, పృథ్వీ రాజ్ కొఠారీలపై కంప్లైంట్ ఇచ్చారు.

కంప్లైంటె రిజిష్టర్ తీసుకున్నప్పటి నుంచి ఆరోపణలపై విచారణ జరుపుతున్నారే కానీ, ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని మీడియా ముందు వాపోతున్నారు.

ప్రస్తుతం తప్పించుకుతిరుగుతున్న రియాజ్ భటిపై ఉన్న క్రిమినల్ రికార్డుల్లో ఎక్స్ టార్షన్, ఫోర్జరీ, భూ ఆక్రమణల కేసులు ఉన్నాయి. బార్స్ అండ్ రెస్టారెంట్ ఓనర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

……………………………………… : ఖమ్మం జిల్లా వాసులను వణికిస్తున్న పులుల సంచారం

భటి భార్య రేణుమా తాను చేసిన కంప్లైంట్ లో తన భర్త వైవాహిక అత్యాచారానికి ఒడిగట్టాడంటూ.. అతని స్నేహితులతో, వ్యాపారవేత్తలతో, హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులతో కలిసి అత్యాచారానికి ప్రయత్నించాడంటూ కంప్లైంట్ చేశారు. దానికి ఒప్పుకోకపోతే ఇద్దరు పిల్లలను చంపేస్తానని కూడా బెదిరించాడట.

2011-2012 మధ్య కాలంలో మునాఫ్ పటేల్, హార్దిక్ పాండ్యాలతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలని బలవంతపెట్టాడట. హార్దిక్ పాండ్యాతో పాటు మరో ఇద్దరు స్నేహితులు మద్యం మత్తులో అసహజ శృంగారానికి కూడా పాల్పడ్డారని కంప్లైంట్ లో పేర్కొంది.

నేను పోలీసులను కలిసి ఎఫ్ఐఆర్ లో రిజిష్టర్ చేయిద్దామనుకుంటున్నా. కానీ, కుదరడం లేదు. సెప్టెంబరులోనే అప్లికేషన్ సబ్‌మిట్ చేసినా పట్టించుకోవడం లేదు. అని రేణుమా మీడియా ముందు వెల్లడించారు.