Saweety Boora : మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణం

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు. ఒకేరోజు రెండు స్వర్ణ పతకాలు సాధించారు. (Saweety Boora)

Saweety Boora : మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణం

Saweety Boora : మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు. ఒకేరోజు రెండు స్వర్ణ పతకాలు సాధించారు. తొలుత 48 కిలోల విభాగంలో భారత్ కు స్వర్ణ పతకం దక్కింది. నీతూ గాంగాస్ ఈ మెడల్ సాధించింది. ఫైనల్ లో మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్ ను 5-0 తేడాతో నీతూ మట్టి కరిపించింది. వరుసగా 4 బౌట్లలో నెగ్గి స్వర్ణ పతకం సాధించింది నీతూ సింగ్.

Also Read..Nitu Ghanghas: బాక్సింగ్‌లో సత్తా చాటిన నీతూ గంగాస్.. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్

ఆ తర్వాత 81 కిలోల విభాగంలో స్వీటీ బూరా గోల్డ్ మెడల్ అందుకుంది. ఫైనల్ లో చైనాకు చెందిన వాంగ్ లీనాపై 4-3తో పంచులతో విరుచుకుపడ్డ స్వీటీ.. గోల్డ్ కొల్లగొట్టింది. 2014లో ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న స్వీటీ.. ఈసారి పట్టుదలతో పసిడిని ఒడిసిపట్టుకుంది. భారత్ కు చెందిన మేరీకోమ్, సరితా దేవి, నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్లుగా నిలవగా.. తాజాగా ఈ జాబితాలో నీతూ, స్వీటీ కూడా చేరారు.

కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత నీతూ గాంగాస్ స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లోనూ పసిడి పంచ్ విసిరింది. ఫైనల్లో ప్రత్యర్థి బలహీనతలను సొమ్ము చేసుకున్న నీతూ దూకుడు కనబరుస్తూ పంచ్ ల వర్షం కురిపించింది. ఈ విజయంతో నీతూ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచిన 6వ భారత మహిళా బాక్సర్ గా నిలిచింది.(Saweety Boora)

గతంలో 2002, 2005, 2006, 2008, 2010, 2018లో మేరీ కోమ్ పసిడి పతకాలు నెగ్గగా… 2006లో సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ, 2022లో నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణం సాధించారు.

Also Read..Issy Wong : వారెవ్వా వాంగ్.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు, రికార్డ్ సృష్టించిన ముంబై బౌలర్