Issy Wong : వారెవ్వా వాంగ్.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు, రికార్డ్ సృష్టించిన ముంబై బౌలర్

ముంబై బౌలర్ ఇస్సీ వాంగ్ బంతితో అదరగొట్టింది. హ్యాట్రిక్ వికెట్లు తీసి అదుర్స్ అనిపించింది. 13వ ఓవర్ లో వాంగ్ మూడు వికెట్లు తీసింది. 13వ ఓవర్ 2,3,4 బంతులకు ముగ్గురిని ఔట్ చేసింది.(Issy Wong)

Issy Wong : వారెవ్వా వాంగ్.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు, రికార్డ్ సృష్టించిన ముంబై బౌలర్

Issy Wong : ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్)లో భాగంగా కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోర్ చేసింది. యూపీ జట్టుకి 183 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది.

183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ జట్టుని ముంబై బౌలర్లు దెబ్బకొట్టారు. రెగులర్ ఇంటర్ వెల్స్ లో వికెట్లు తీసి యూపీని కట్టడి చేశారు. ఈ క్రమంలో ముంబై బౌలర్ ఇస్సీ వాంగ్ బంతితో అదరగొట్టింది. హ్యాట్రిక్ వికెట్లు తీసి అదుర్స్ అనిపించింది. 13వ ఓవర్ లో వాంగ్ మూడు వికెట్లు తీసింది. 13వ ఓవర్ 2,3,4 బంతులకు ముగ్గురిని ఔట్ చేసింది. డబ్ల్యూపీఎల్ లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన తొలి బౌలర్ గా వాంగ్ రికార్డ్ నెలకొల్పింది. కిరణ్ నవ్ గిర్ (43), సిమ్రాన్ షేక్(0), సోఫీ ఎకల్ స్టోన్(0) వికెట్లను వాంగ్ తీసింది.(Issy Wong)

Also Read..Asia Cup 2023: పంతం నెగ్గించుకున్న భారత్..! ఆసియాకప్‌ టోర్నీలో భారత్ మ్యాచ్‌లు యూఏఈలో..?

ఇక, 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ జట్టు.. 94 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోర్ చేసింది. యూపీ జట్టుకి 183 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. ముంబై జట్టులో నాట్‌ సీవర్ హాఫ్‌ సెంచరీతో చెలరేగింది. 38 బంతుల్లోనే 72 పరుగులు బాది నాటౌట్ గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. యస్తికా భాటియా (21), హేలీ మాథ్యూస్‌ (26), అమేలియా కేర్‌ (29) ఫర్వాలేదనిపించారు. యూపీ బౌలర్లలో సోఫీ 2 వికెట్లు తీయగా.. గ్రేస్‌ హారీస్‌, చోప్రా తలో వికెట్‌ పడగొట్టారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫైనల్ చేరింది. ఢిల్లీతో కప్‌ కోసం తలపడే జట్టు నేడు తేలిపోతుంది.

Also Read..Suryakumar Yadav: వరుసగా మూడు వన్డేల్లో గోల్డెన్ డక్.. ఆ జాబితాలో చోటు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్

183 పరుగుల భారీ టార్గెత్ తో బరిలోకి దిగిన యూపీ జట్టును ముంబై మీడియం పేసర్ ఇస్సీ వాంగ్ దెబ్బతీసింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసింది. ధాటిగా ఆడుతున్న కిరణ్ నవ్ గిరే (43)ను ఆ ఓవర్ రెండో బంతికి ఔట్ చేసిన ఇస్సీ వాంగ్.. ఆ తర్వాత వరుసగా మరో రెండు బంతుల్లో సిమ్రాన్ షేక్ (0), సోఫీ ఎక్సెల్ స్టోన్ (0)ను బౌల్డ్ చేసింది.

ఈ మ్యాచ్ లో ఇస్సీ వాంగ్ 15 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. 20 ఏళ్ల ఇస్సీ వాంగ్ ఇంగ్లండ్ కు చెందిన మహిళా క్రికెటర్. భారత్ లో తొలిసారి నిర్వహిస్తున్న డబ్ల్యూపీఎల్ లో ఆమె ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తోంది. డబ్ల్యూపీఎల్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ గా ఇస్సీ రికార్డు నెలకొల్పింది.

ఈ నెల 26న జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. పాయింట్ల టేబుల్ లో అగ్రస్థానం పొందడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్స్ కు క్వాలిఫై అయ్యింది.