WPL2023 Eliminator MIvsUPW : ఫైనల్‌కి దూసుకెళ్లిన ముంబై.. వాంగ్ హ్యాట్రిక్‌తో యూపీపై ఘనవిజయం

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. 72 పరుగుల తేడాతో యూపీపై ఘనవిజయం సాధించింది.(WPL2023 Eliminator MIvsUPW)

WPL2023 Eliminator MIvsUPW : ఫైనల్‌కి దూసుకెళ్లిన ముంబై.. వాంగ్ హ్యాట్రిక్‌తో యూపీపై ఘనవిజయం

WPL2023 Eliminator MIvsUPW : ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్)లో భాగంగా కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. 72 పరుగుల తేడాతో యూపీ వారియర్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఫైనల్ కి దూసుకెళ్లింది. ఆదివారం జరిగే ఫైనల్ లో ఢిల్లీ కేపిటల్స్, ముంబై తలపడనున్నాయి. పేస్ బౌలర్ ఇస్సీ వాంగ్ హ్యాట్రిక్ తో విజృంభించడంతో ముంబై ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఫైనల్లోకి ప్రవేశించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. యూపీ జట్టుకి 183 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది.

Also Read..Suryakumar Yadav: వరుసగా మూడు వన్డేల్లో గోల్డెన్ డక్.. ఆ జాబితాలో చోటు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్

183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీని.. ముంబై బౌలర్లు కట్టడి చేశారు. అద్భుతమైన బౌలింగ్ తో యూపీని షేక్ చేశారు. ముంబై బౌలర్లు రాణించడంతో.. యూపీ జట్టు 17.4ఓవర్లలోనే 110 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ముఖ్యంగా ఇస్సీ వాంగ్ దుమ్మురేపింది. హ్యాట్రిక్ వికెట్ల తీసి యూపీని కోలుకోలేని దెబ్బ కొట్టింది.(WPL2023 Eliminator MIvsUPW)

Also Read..Asia Cup 2023: పంతం నెగ్గించుకున్న భారత్..! ఆసియాకప్‌ టోర్నీలో భారత్ మ్యాచ్‌లు యూఏఈలో..?

ముంబై బౌలర్ ఇస్సీ వాంగ్ బంతితో అదరగొట్టింది. హ్యాట్రిక్ వికెట్లు తీసి అదుర్స్ అనిపించింది. 13వ ఓవర్ లో వాంగ్ మూడు వికెట్లు తీసింది. 13వ ఓవర్ 2,3,4 బంతులకు ముగ్గురిని ఔట్ చేసింది. డబ్ల్యూపీఎల్ లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన తొలి బౌలర్ గా వాంగ్ రికార్డ్ నెలకొల్పింది. కిరణ్ నవ్ గిర్ (43), సిమ్రాన్ షేక్(0), సోఫీ ఎకల్ స్టోన్(0) వికెట్లను వాంగ్ తీసింది.(WPL2023 Eliminator MIvsUPW)

ముంబై జట్టులో నాట్‌ సీవర్ హాఫ్‌ సెంచరీతో చెలరేగింది. 38 బంతుల్లోనే 72 పరుగులు బాది నాటౌట్ గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. యస్తికా భాటియా (21), హేలీ మాథ్యూస్‌ (26), అమేలియా కేర్‌ (29) ఫర్వాలేదనిపించారు. యూపీ బౌలర్లలో సోఫీ 2 వికెట్లు తీయగా.. గ్రేస్‌ హారీస్‌, చోప్రా తలో వికెట్‌ పడగొట్టారు.(WPL2023 Eliminator MIvsUPW)

యూపీ జట్టును ఇస్సీ వాంగ్ దెబ్బతీసింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ లో ఇస్సీ వాంగ్ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసింది. ధాటిగా ఆడుతున్న కిరణ్ నవ్ గిరే (43)ను ఆ ఓవర్ రెండో బంతికి ఔట్ చేసిన ఇస్సీ వాంగ్.. ఆ తర్వాత వరుసగా మరో రెండు బంతుల్లో సిమ్రాన్ షేక్ (0), సోఫీ ఎక్సెల్ స్టోన్ (0)ను బౌల్డ్ చేసింది. ఈ మ్యాచ్ లో ఇస్సీ వాంగ్ 15 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. 20 ఏళ్ల ఇస్సీ వాంగ్ ఇంగ్లండ్ కు చెందిన మహిళా క్రికెటర్. భారత్ లో తొలిసారి నిర్వహిస్తున్న డబ్ల్యూపీఎల్ లో ఆమె ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తోంది. డబ్ల్యూపీఎల్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ గా ఇస్సీ రికార్డు నెలకొల్పింది.

ఈ నెల 26న జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. పాయింట్ల టేబుల్ లో అగ్రస్థానం పొందడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్స్ కు క్వాలిఫై అయ్యింది.