Yuzvendra Chahal: “ఆ ప్లేయర్ ఫుల్లుగా తాగి 15వ ఫ్లోర్ నుంచి నన్ను పడేయబోయాడు”

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొత్త ఫ్రాంచైజీకి ఆడుతున్న చాహల్.. టీమ్మేట్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన ఫామ్ ను నిరూపించుకోవడానికి అడపాదడపా వికెట్లు తీసి చూపిస్తున్నాడు.

Yuzvendra Chahal: “ఆ ప్లేయర్ ఫుల్లుగా తాగి 15వ ఫ్లోర్ నుంచి నన్ను పడేయబోయాడు”

Chahal

Yuzvendra Chahal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొత్త ఫ్రాంచైజీకి ఆడుతున్న చాహల్.. టీమ్మేట్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన ఫామ్ ను నిరూపించుకోవడానికి అడపాదడపా వికెట్లు తీసి చూపిస్తున్నాడు. రీసెంట్ గా జరిగిన మూడు మ్యాచ్ లలో ఏడు వికెట్లు పడగొట్టి జోష్ లో కనిపిస్తున్నాడు. డ్రెస్సింగ్ రూంలో, మైదానంలో ఈజీ గోయింగ్ యాటిట్యూడ్ తో ఆకట్టుకునే చాహల్.. తన జీవితంలో జరిగిన ఈ ప్రమాదరకమైన సంఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ట్విట్టర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ పంచుకున్న ఆ వీడియోలో.. కరుణ్ నాయర్, రవిచంద్రన్ అశ్విన్ లు కూడా కనిపించారు. ఈ సందర్భంగా చాలా మందికి తెలియని సీక్రెట్ చెప్పాడు చాహల్.

‘చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. దీని గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. 2013లో ముంబై ఇండియన్స్ తో ఆడుతున్నా. బెంగళూరు వేదికగా ఆ రోజు మ్యాచ్ ఆడాం. ఆ తర్వాత అందరం కలిసి కూర్చున్నాం. ఇంతలో ఓ ప్లేయర్ బాగా తాగి నన్ను పిలిచాడు. అలా మాట్లాడుకుంటుండగానే బాల్కనీ వరకూ తీసుకెళ్లి కిందకు వేలాడదీసి పట్టుకున్నాడు’

Read Also : చెలరేగిన చాహల్… 1000వ వన్డేలో భారత్ టార్గెట్ 177

‘అతణ్ని చేతులతో గట్టిగా పట్టుకున్నా. కాసేపటికి నా గ్రిప్ కోల్పోయా కూడా. దాదాపు నేను 15వ ఫ్లోర్ లో ఉన్నా. సడెన్ గా చాలా మంది అక్కడకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అప్పుడు చాలా భయం వేసింది. నీళ్లు తాగించి కూర్చోబెట్టారు. అప్పుడు రియలైజ్ అయ్యా. బయటకు వచ్చినప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలని. వెంట్రుక వాసి గ్యాప్ లో అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోగలిగా’ అని ఆ సంగతి గుర్తు చేసుకున్నాడు చాహల్.