Home » agriculture
చల్లని వాతావరణం వుండటం తో ఇతర పంటలు కంటే ఎక్కువగా కాఫీ తోటల సాగుకి అనుకూలంగా ఉంటుంది. కాఫీ తోటలు ఎదిగి పంట దశకు చేరుకున్న తర్వాత పళ్ళు తీసి ఎండబెట్టి వాటిని గ్రేడింగ్ చేసి గిరిజన కో ఆపరేటీవ్ సొసైటీలకు, ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతూ ఉంటారు.
అజొల్లా సేకరించిన తర్వాతకాని, ఎరువు మిశ్రమం కలిపినప్పుడుగాని మొక్కలు తిరగబడే అవకాశం వుంది, కాబట్టి, మొక్కలు నిలదొక్కుకునేందుకు వీలుగా ప్రతిసారీ పైనుంచి మంచినీరు చిలకరించంటం మరువకూడదు.
కలుపు నివారణలో భాగంగా నాటిన వెంటనే భూమిలో తగినంత తేమ వున్నప్పుడు ఎకరాకు 1.3లీటర్ల నుంచి 1.6లీటర్ల వరకు పెండిమిథాలిన్ లేదా 200మిల్లీలీటర్ల ఆక్సీఫ్లోరోఫిన్ 200లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపును నివారించవచ్చు.
ఎరుపు, తెలుపు, నీలి వర్ణాలతో కనిపిస్తున్న ఈ గ్లాడియోలస్ ఫ్లవర్స్ ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నాయి కదూ.. ఈ పూలను విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సాగుచేస్తున్నారు.
మొవ్వు ఈగ బారి నుండి పంటను రక్షించుకోవడానికి ఒక కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సామ్ 70% డబ్ల్యుఎస్ లేదా 12 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 48 ఎఫ్ఎస్ కలిపి విత్తనశుద్ధి చేయటం ద్వారా దీనిని నివారించుకోవచ్చు.
కొర్రమేనుతోపాటు మరికొన్ని చేపల రకాలను అభివృద్ధి చేస్తున్నారు రైతు. వీటితో పాటు అలంకార చేపలు, ముత్యపు చిప్పల పెంపకం చేస్తున్నారు. అంతే కాదు ఈ చేపల నర్సరీ ట్యాంకుల నుండి వచ్చే నీటిని వృధా కాకుండా ఉండేందుకు అరటి, జామ తోటలను నాటి వాటికి అందిస్త�
బొప్పాయి తోటల్లో చెట్ల నుంచి పాలసేకరణ ఉదయం తెల్లవారు జాము నుండి పదిగంటల వరకు మాత్రమే చేస్తారు. బొప్పాయి పాలసేకరణ ప్రత్యేక పద్ధతుల్లో కూలీలు సేకరిస్తుంటారు.
తెగుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక మండలాల్లో, పూత, పిందె దశలో వున్న కంది పంటలో ఎండుతెగులు సోకటంతో, దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత , ఆదాయం లభించడం లేదు. వ్యవసాయాన్ని శాస్త్రీయబద్ధంగా చేపడుతూ క్షేత్రవనరులనూ సమర్ధవంతంగా వినయోగించుకోవడం అత్యంత అవసంరం.
తెలంగాణలో ఎక్కడ పట్టుదారాలు తీసే పరిశ్రమలులేదు. అందుకే స్థానిక నేత కార్మికులకు దారం అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో.. కృష్ణ రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్ ను ప్రారంభించారు.