Home » agriculture
సెర్కోస్పొరా, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుళ్లు, బాక్టీరియా నల్లమచ్చ ఆశించి పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. వీటిని గుర్తించిన వెంటనే సకాలంలో అరికడితే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
తేనెటీగల పెంపకం సంచార పరిశ్రమ. పంటల పూత దశ ఎక్కడ వుంటే అక్కడకు పెట్టెలను తరలించాలి. రాణీఈగ గుడ్లు పెట్టే సామర్థ్యం, కూలీ ఈగలు సేకరించే మకరందం పైనే తేనె ఉత్పత్తి ఆధారపడి వుంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వరి ప్రస్తుతం చిరు పొట్ట దశ నుండి గింజ పాలుపోసుకునే దశకు చేరుకుంది. అధిక దిగుబడి సాధించేందుకు కీలకమైన ఈ దశలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దోమపోటు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది .
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా మానిపండు, సుడిదోమ, కాండ తొలిచే పురుగుల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో నివారించకపోతే 20 నుండి 30 శాతం వరకు దిగుబడులను నష్టపోవాల్సి ఉంటుంది.
వేరుశనగ సాగులో సగటు వుత్పత్తి మన ప్రాంతంలో 5 నుండి 6క్వింటాళ్లకు మించటంలేదు. దీనికి ప్రధానంగా వేరుశనగలో ఆయాప్రాంతాలకు అనుగణంగా రకాల ఎంపికలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించకపోవటం, యాజమాన్యంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
దోస తక్కువ చీడపీడలు ఆశించి ఎక్కువ దిగుబడులు వస్తుండటంతో బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు మూడు ఎకరాల్లో సాగు చేపట్టాడు. ప్రస్తుతం మార్కెట్ అధిక రేటు పలుకుతుండటంతో.. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు.
మొక్కజొన్నకు మంచి మార్కెట్టు ధర రావాలంటే కొన్ని నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. గింజలలో తేమ 14.0 శాతంకి మించకుండా ఉండాలి. దుమ్ము, చెత్త మట్టి పెళ్ళలు, రాళ్ళు మొదలయినవి 1.0 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు.
ఖరీఫ్‌లో వేరుశనగ పంటను జూలై రెండవ వక్షం వరకు విత్తుకోవచ్చును. ఈ వంటను యానంగిలో అక్టోబరు రెండవ పక్షంలోపు, సెప్టెంబరు మొదటి పక్షం నుండి నవంబరు రెండవ వక్షం వరకు విత్తుకోవచ్చును.
టమోటాలో ఊతం కల్పించే స్టేకింగ్ విధానాన్ని రైతులు ఆచరిస్తే కాయలు నేలకు తగలకుండా నాణ్యత పెరిగి, మంచి పరిమాణంలో వుంటాయి.భూమిలో తేమను బట్టి వారం పదిరోజులకు ఒక నీటితడినిస్తే సరిపోతుంది.
డ్రాగన్ ఫ్రూట్ రైతులకు మేలు చేసే పంట. సాగులో పెద్దగా పని ఉండదు. మందులు వేయాల్సిన పనిలేదు. నీటి అవసరం చాలా తక్కువే. సేంద్రియ పద్ధతిలో పంట పండించవచ్చు. సులభ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు.