Groundnut Varieties : రబీకి అనువైన వేరుశనగ రకాలు.. సాగులో అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు

వేరుశనగ పంటకు 450 నుండి 600 మిల్లీ లీటర్ల నీరు అవసరమవుతుంది. తేలికపాటి నేలల్లో 6 నుండి 8 తడులు ఇవ్వవలసి ఉంటుంది. విత్తే ముందు నేల బాగా తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి.

Groundnut Varieties : రబీకి అనువైన వేరుశనగ రకాలు.. సాగులో  అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు

Groundnut Varieties

Updated On : November 7, 2023 / 3:39 PM IST

Groundnut Varieties : రబీకాలంలో తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమైన నూనెగింజ పంట వేరుశనగ. ఖరీఫ్ రబీ కాలాల్లో 5లక్షల ఎకరాల్లో ఈ పంట సాగవుతున్నా… రబీలో నీటి వసతి కింద సుమారు 4లక్షల ఎకరాల్లో ఈ పంట వుండటం విశేషం. ప్రధానంగా మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో  అధికంగా సాగవుతోంది. ప్రస్థుతం వేరుశనగ విత్తేందుకు అనువైన సమయం. రైతు సాగుకు సన్నద్ధమవుతున్న నేపధ్యంలో రబీకి అనువైన రకాలు, సాగులో పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డా. కె . శ్రీధర్ .

READ ALSO : Groundnut Farming : వేరుశనగలో అధిక దిగుబడులకోసం మెళకువలు

వేరుశనగను  ఖరీఫ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా సాగుచేస్తారు. తెలంగాణాలో ఖరీఫ్ విస్తీర్ణం చాలా తక్కువ. వర్షాధార పంట కనుక ఏటా ఈ పంటను వాతావరణ ఒడిదుడుకులు, బెట్ట పరిస్థితులు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అయితే రబీకాలంలో వాతావరణం కొంత స్థిరంగా వుండటం, నీటి వసతి కింద సాగుచేయటం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. దీంతో తెలంగాణాలో రబీ విస్తీర్ణం 4 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరకోస్తా, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో రబీ వేరుశనగ సాగవుతోంది.

READ ALSO : Groundnut Crop : వేరుశనగ పంటలో కాండం కుళ్ళు తెగులు నివారణ

ఉత్తరకోస్తాలో, దక్షిణ రాయలసీమలో నవంబరు నుంచి డిసెంబరు వరకు, ఉత్తర తెలంగాణాలో అక్టోబరు 30 వరకు దక్షిణ తెలంగాణాలో సెప్టెంబరు మొదటి పక్షం నుండి నవంబర్ రెండో పక్షం వరకు ఈపంటను విత్తుకోవటానికి అనుకూలం. ఇసుకతోకూడిన గరపనేలలు, నీరు ఇంకే స్వభావం వున్న ఎర్రచల్కానేలలు ఈ పంటసాగుకు శ్రేష్ఠమైనవి. మేలైన రకాల ఎంపికతోపాటు, మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు ఆశించిన దిగుబడులు పొందవచ్చంటూ వేరుశనగ సాగులో మెలకువలు తెలియజేస్తున్నారు, మహబూబ్ నగర్ జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డా. కె . శ్రీధర్ .

READ ALSO : Groundnut Crop : వేరుశనగలో పంటను ఆశించే పొగాకు లద్దె పురుగు.. నివారణ చర్యలు

వేరుశనగ పంటకు 450 నుండి 600 మిల్లీ లీటర్ల నీరు అవసరమవుతుంది. తేలికపాటి నేలల్లో 6 నుండి 8 తడులు ఇవ్వవలసి ఉంటుంది. విత్తే ముందు నేల బాగా తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి. రెండవ తడిని విత్తిన తరువాత మొలక వచ్చిన 20 నుండి 25 రోజులకు ఇవ్వాలి. తరువత తడులు నేల లక్షణం, బంక మంట్టి శాతంను అనుసరించి 7 నుండి 10 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. చివరి తడి పంటకోతకు 4 నుండి 7 రోజుల ముందు ఇవ్వాలి.  పైరు ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరే వరకు అంటే విత్తిన 40 నుండి 50 రోజుల వరకు సున్నితమైనది. ఈ దశలో నీరు సక్రమంగా తగు మోతాదులో ఇచ్చినట్లైతే నాణ్యమైన కాయలతో అధిక దిగుబడిని పొందవచ్చు.