Sorghum Cultivation : జొన్నపంటలో ఎరువుల యాజమాన్యం, తెగుళ్ళ నివారణ !

మొవ్వు ఈగ బారి నుండి పంటను రక్షించుకోవడానికి ఒక కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సామ్‌ 70% డబ్ల్యుఎస్‌ లేదా 12 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ 48 ఎఫ్‌ఎస్‌ కలిపి విత్తనశుద్ధి చేయటం ద్వారా దీనిని నివారించుకోవచ్చు.

Sorghum Cultivation : జొన్నపంటలో ఎరువుల యాజమాన్యం, తెగుళ్ళ నివారణ !

Sorghum Cultivation

Sorghum Cultivation : ఖరీఫ్‌లో జొన్న పంటను జూన్‌ రెండవ పక్షం నుండి జూన్‌ 30 వరకు విత్తుకోవచ్చు. రబీలో అక్టోబరు రెండవ పక్షం లోపు విత్తుకుంటే పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది. జొన్న పంట సాగు చేసేటపుడు తేమను నిలుపుకునే బరువైన నేలలు లేదంటే ఒకట్రెండు తడులు ఇచ్చే సదుపాయం ఉంటే హైబ్రిడ్‌లను ఎంచుకొని అధిక దిగుబడులు సాధించవచ్చును. తేలిక పాటి నేలల్లో అయితే సూటి రకాలను ఎంపిక చేసుకోవాలి.

READ ALSO : Maize Cultivation : మొక్కజొన్నపంటకు కాండంతొలుచు పురుగుల బెడద

ఎరువుల విషయానికి వస్తే ఎకరానికి 3-4 టన్నులు పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగుచేయాలనుకుంటే ఎకరాకు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం మరియు 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేయాలి. రబీలో జొన్నను నీటిపారుదల క్రింద సాగు చేస్తే ఎకరాకు 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాష్‌ నిచ్చే ఎరువులు వేయాలి. నత్రజని ఎరువులను సగభాగం విత్తేముందు, మిగతా సగం పైరు 30-35 రోజుల దశలో వేయాలి.

READ ALSO : Corn Crop : మొక్కజొన్నకు కత్తెరపురుగుల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్త సూచనలు

జొన్నను ఆలస్యంగా విత్తితే మొవ్వు ఈగ తీవ్రంగా ఆశించి, మొక్కల సాంద్రత తగ్గి, తద్వారా దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. మొవ్వు ఈగ బారి నుండి పంటను రక్షించుకోవడానికి ఒక కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సామ్‌ 70% డబ్ల్యుఎస్‌ లేదా 12 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ 48 ఎఫ్‌ఎస్‌ కలిపి విత్తనశుద్ధి చేయటం ద్వారా దీనిని నివారించుకోవచ్చు.

READ ALSO : kharif Jowar Cultivation : ఖరీఫ్ జొన్న సాగులో మేలైన యాజమాన్యం

గింజ బూజు తెగులు. ఇది గింజలపై నల్లని బూజు పెరుగుదల కనిపిస్తుంది. పూత మరియు గింజ కట్టే దశలో అధిక వర్షాలు పడినపుడు ఈ తెగులు ఆశిస్తుంది. తెగులు ఆశించే పరిస్థితుల్లో ప్రొపికొనజోల్‌ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి గింజ ఏర్పడే దశలో పిచికారి చేయాలి.

బంక కారు తెగులు ఈ తెగులు సోకిన కంకుల గింజల నుంచి తియ్యటి జిగురు వంటి ద్రవం కారు తుంది. పంట ఆలస్యంగా విత్తి నపుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. బెనోమిల్‌ 1 గ్రా. లీటరు నీటికి కలిపి కంకులపై పిచికారి చేయాలి.