Redgram Cultivation : కందిలో ఎండుతెగులు ఉదృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
తెగుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక మండలాల్లో, పూత, పిందె దశలో వున్న కంది పంటలో ఎండుతెగులు సోకటంతో, దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

Redgram Cultivation
Redgram Cultivation : ఖరీఫ్ లో సాగుచేసిన కంది, వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత, పిందె దశలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు కందిలో చీడపీడల ఉదృతి పెరింగింది. ఈ సున్నిత దశలో ఎండుతెగులు ఆశించిన తీవ్రనష్టం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి
READ ALSO : స్మార్ట్ సేద్యం.. యాప్ సాయంతో పంటలు… నూజివీడు త్రిపుల్ ఐటీ విద్యార్థుల ఘనత
ఖరీఫ్ కంది పంటకాలం రకాన్నిబట్టి 150 నుండి 180 రోజులు. జూలై నుంచి ఆగష్టు వరకు విత్తిన ఈ పంట చాలా ప్రాంతాల్లో కాయ తయారయ్యే దశలో వుంది. డిసెంబరు నెలాఖరు వరకు పూత వృద్ధి చెందే అవకాశం వుంది. తెలంగాణలో నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఈ సారి కంది విస్తీర్ణం భాగా పెరిగింది.
READ ALSO : Safflower Cultivation : కుసుమలో అధిక దిగుబడుల కోసం సాగులో పాటించాల్సిన మెళకువలు
అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చేలల్లో నీరు నిలిచి చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎంతో శ్రమకోర్చి, పంటను ఈ దశకు తీసుకొచ్చిన రైతులకు, ఇప్పుడు తెగుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక మండలాల్లో, పూత, పిందె దశలో వున్న కంది పంటలో ఎండుతెగులు సోకటంతో, దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రైతులు ఈ తెగులుపై నిఘా వుంచి వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి