Safflower Cultivation : కుసుమలో అధిక దిగుబడుల కోసం సాగులో పాటించాల్సిన మెళకువలు

గతంలో ఎకరాకు 3,4 క్వింటాళ్ల దిగుబడి రావటం కష్టంగా వుండేది. కానీ ప్రస్థుతం అభివృద్ధిచెందిన రకాలతో ఎకరాకు 6 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది.

Safflower Cultivation : కుసుమలో అధిక దిగుబడుల కోసం సాగులో పాటించాల్సిన మెళకువలు

safflower

Updated On : September 22, 2023 / 11:35 AM IST

Safflower Cultivation : నూనెగింజ పంటల్లో విశిష్ఠ ప్రాధాన్యత కలిగిన పంట కుసుమ. చల్లని వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే ఈ పంటను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 వేల ఎకరాల్లో సాగవుతుంది ఈ పంటలో ఆదాయం తక్కువగా వుండటం,  మొక్కకు ముళ్లు అధికంగా వుండటం, పంట కోతకు కూలీలు దొరకక పోవటం వల్ల క్రమేపి దీని సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. అయితే ఇటీవలికాలంలో కుసుమ నూనెకు గిరాకీ పెరగటం, కుసుమ పూతకు కూడా మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో ఇప్పుడిప్పుడే సాగు విస్తీర్ణం పెరుగుతుంది. అయితే కుసుమను సాగుచేసే రైతులు ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం…

READ ALSO : Chandrababu Custody : చంద్రబాబుకు మరో రెండు రోజులు రిమాండ్ పొడిగింపు .. జడ్జితో బాబు ఏమన్నారంటే

నూనెగింజ పంటల్లో బహుళ ప్రయోజనాలతో ఆకర్షిస్తున్న పంట కుసుమ. దీని  ఆకులు వాడిగా ఉన్న ముళ్లను కలిగి ఉంటాయి. పూలు గుండ్రని ఆకారము కలిగి పచ్చటి పసుపు, నారింజ, ఎరుపు లేక తెలుపు రంగులలో ఉంటాయి.  ఒక్కో పువ్వులో 15-20 గింజలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు 20 నుండి 25 హెక్టార్లలో సాగవుతుంది.

READ ALSO : Lack Of Sleep : నిద్రలేమి బరువు పెంచేలా చేస్తుందా?

ఈ పంటసాగుకు సెప్టెంబరు మొదటి పక్షం నుంచి అక్టోబరు వరకు అనుకూలమైన సమయం. ఆలస్యమైనప్పుడు నవంబరు 15 వరకు కూడా విత్తుకునే అవకాశం వుంది. సాగుచేసిన రకాన్నిబట్టి కుసుమ పంటకాలం 120 నుంచి 135రోజుల వరకు వుంటుంది. గతంలో ఎకరాకు 3,4 క్వింటాళ్ల దిగుబడి రావటం కష్టంగా వుండేది. కానీ ప్రస్థుతం అభివృద్ధిచెందిన రకాలతో ఎకరాకు 6 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది. అయితే సాగు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, చింతపల్లి మండలం వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడిఆర్ డా. టి . అనురాధ.

READ ALSO : Work From Home : మంచంపై నుండే ఆఫీసు కార్యకలాపాలతో ఆరోగ్య సమస్యలు

ఆరోగ్యపరంగా కుసుమ నూనె వాడకం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. హృద్రోగులు, చిన్నారులు, ఎముకల వ్యాధిగ్రస్తులకు ఈ నూనె స్వస్థత చేకూరుస్తుంది. అంతే కాదు కుసుమ పువ్వుల నుండి సేకరీంచే పూరెక్కల నుండి తీసిన రంగును ఆహార పదార్ధాలకు , వస్త్రాలలో అద్దకపు రంగుగా విరివిగా వాడుతున్నారు. ఇప్పుడు టీలలో కూడా వినియోగిస్తున్నారు. అందువల్ల పూరెక్కలకు సేకరించి మార్కెట్ చేస్తే రైతుకు అదనపు రాబడి లాభస్తుంది.