Home » andhrapradesh
రేపు కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయనుంది. ధరణి స్థానంలో కొత్త యాప్, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు వంటి హామీలను కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపర్చే అవకాశం ఉంది.
నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి చేపట్టనున్న బస్సు యాత్ర బుధవారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభం కానుంది.
అభివృద్ధికి నిధులు లేవని, అభివృద్ధి జరగడం లేదని అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ఓవరాల్ అభివృద్ధి జరుగుతోంది. పేదల ఇళ్లు, వైద్యం నిరంతరం అందితే అది అభివృద్ధి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలుచోట్ల ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులు సోదాలు నిర్వహించారు. అమరుల బంధు మిత్రుల సంఘం, పౌరహక్కుల సంఘం కీలక నేతల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
దక్షిణ భారతదేశంలోనే అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్టణం. విశాఖలో కార్యాలయాలను సిద్ధం చేస్తున్నాం. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని సుబ్బారెడ్డి చెప్పారు.
భూగర్భంలో ఉండే బొజ్జ గణపయ్య కోరిక కోరికలు తీరుస్తాడు. మనస్సులో ఏదైనా అనుకుని ఆ కోరికను గణపయ్య చెవిలో చెబితే ఆ కోరిక నెరవేరుతుందట..
డెంగీ జనాల్ని భయపెడుతోంది. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. సాధారణ జ్వరం లాగనే డెంగీ ఫీవర్ వస్తుంది. కానీ జ్వరం తగ్గిన తరువాత దాని లక్షణాలు బయటపడతాయట. లక్షణాలు బయటపడగానే వెంటనే అలర్ట్ అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.
పవన్ తో సినిమాలు తెరకెక్కిస్తున్న నిర్మాతలు DVV దానయ్య, వివేక్, మైత్రి రవి శంకర్, BVSN ప్రసాద్, AM రత్నంలతో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ యాగంలో పాల్గొని, జనసేన పార్టీ ఆఫీస్ సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు.
అప్పుడు అవమానించి ఇప్పుడు సన్మానాలా? అప్పుడు చెప్పులు విసిరి ఇప్పుడు పాదపూజలా? వెన్నుపోటు పొడిచి ఇప్పుడు పొడగడ్తలా?
కోడికత్తి డ్రామా.. మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేశాడంటూ ఆరోపించారు. రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్టు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకుని ప్రజల్ని నట్టేట ముంచారంటూ విమర్శించారు.