YV Subbareddy : ఏపీని రాజధానిలేని రాష్ట్రంగా చేసిన ఘనత చంద్రబాబుదే.. దసరా నుంచే విశాఖలో పాలన

దక్షిణ భారతదేశంలోనే అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్టణం. విశాఖలో కార్యాలయాలను సిద్ధం చేస్తున్నాం. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని సుబ్బారెడ్డి చెప్పారు.

YV Subbareddy : ఏపీని రాజధానిలేని రాష్ట్రంగా చేసిన ఘనత చంద్రబాబుదే.. దసరా నుంచే విశాఖలో పాలన

YV Subbareddy

Updated On : September 21, 2023 / 12:42 PM IST

YV Subbareddy : ఏపీని రాజధానిలేని రాష్ట్రంగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదేనని వైసీపీ నేత వై.వి. సుబ్బారెడ్డి విమర్శించారు. విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గంలో విజయగణపతికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విజయదశమి నుంచి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి విశాఖ వేదికగా పాలన సాగించనున్నారని తెలిపారు. విఘ్నాలు ఉన్నా తొలిగిపోవాలని పూజలు చేశామని, మరళ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని గణనాథుడిని పూజించామని అన్నారు. మూడు రాజధానులకు న్యాయపరమైన ఇబ్బందులు రావడం వలన కాస్త ఆలస్యం అయిందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలకు భరోసా కల్పించనున్నామని తెలిపారు.

Read Also: Nara Lokesh : చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ : నారా లోకేష్

దక్షిణ భారతదేశంలోనే అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్టణం. విశాఖలో కార్యాలయాలను సిద్ధం చేస్తున్నాం. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని సుబ్బారెడ్డి చెప్పారు. విశాఖను రాజధానికి అనుకూలంగా ఉంటుందనే కేంద్రంకూడా విశాఖను అభివృద్ధి చేయనుందని అన్నారు. చంద్రబాబు అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయారని అన్నారు. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని, కోర్టులపై మాకు పూర్తి నమ్మకం ఉందని సుబ్బారెడ్డి చెప్పారు.

Read Also:  AP Assembly : ‘రా చూసుకుందాం’ అంటూ బాలకృష్ణకు మంత్రి అంబటి సవాల్.. తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

టీడీపీ ఎంతో ఇబ్బందుల్లో ఉందని, టీడీపీని నడిపించడానికి వేరొక నాయకుడికి ఆ పార్టీని అప్పగించిన పరిస్థితి ఏర్పడిందని సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలు ఉన్నా వైసీపీ సిద్ధంగా ఉందని వై.వి. సుబ్బారెడ్డి చెప్పారు.