Dengue Fever : జ్వరం తగ్గిన తరువాతే డెంగీ బయటపడుతుందట.. బీ అలర్ట్

డెంగీ జనాల్ని భయపెడుతోంది. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. సాధారణ జ్వరం లాగనే డెంగీ ఫీవర్ వస్తుంది. కానీ జ్వరం తగ్గిన తరువాత దాని లక్షణాలు బయటపడతాయట. లక్షణాలు బయటపడగానే వెంటనే అలర్ట్ అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.

Dengue Fever : జ్వరం తగ్గిన తరువాతే డెంగీ బయటపడుతుందట.. బీ అలర్ట్

dengue fever

Dengue Fever : భారీ వర్షాలు, చాలా చోట్ల వరదలు కారణంగా రకరకాల జ్వరాలు, కండ్లకలకతో పాటు డెంగీ భయపెడుతోంది. సాధారణ జ్వరంలాగే వచ్చే ఈ ఫీవర్  తగ్గగానే డెంగీ ప్రమాదం తప్పిపోయిందని భావిస్తారు. కానీ జ్వరం తగ్గుతున్న సమయంలోనే డెంగీ బయటపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

Dengue Precautions : డెంగీ లక్షణాలు గుర్తించిన వెంటనే ఈ జాగ్రత్తలు పాటిస్తే త్వరగా కోలుకోవచ్చు!

జ్వరం వచ్చి తగ్గుతున్న సమయంలో వాంతులు అవడం కానీ, పొట్ట విపరీతంగా నొప్పి రావడం జరిగితే డెంగీ లక్షణాలుగా భావించాలి. ఆహారం సరిగా తీసుకోకపోవడం, డల్‌గా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.  జ్వరం తీవ్రత ఒక్కొక్కరిలో ఒకో రకంగా ఉంటుందట. 1 నుంచి 5 రోజుల వరకూ జ్వరం ఉండే అవకాశం ఉంటుందట. అయితే జ్వరం తగ్గే సమయంలో డెంగీ లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. కొందరిలో జ్వరం నుంచి కోలుకునే సమయంలో ఒంటిపై ఎర్రగా ర్యాష్ రావడం వాటి వల్ల విపరీతంగా దురద రావడం జరుగుతుందట.

Dengue Patients : ఒకే రోజు 2,292 మందికి డెంగీ జ్వరాలు…ప్రజల ఆందోళన

డెంగీ బారిన పడిన అందరిలో ర్యాష్ లక్షణాలు కనిపించడం కానీ , జ్వరం తగ్గి మరల రావడం వంటి లక్షణాలు కనిపించకపోవచ్చునని వైద్యులు చెబుతున్నారు. జ్వరం వచ్చినపుడు పారాసిట్‌మాల్ వాడాలని లేదంటే వెంటనే వైద్యుని సంప్రదించడం అవసరమైతే ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం ఉత్తమమని సూచిస్తున్నారు.