Dengue Patients : ఒకే రోజు 2,292 మందికి డెంగీ జ్వరాలు…ప్రజల ఆందోళన

బంగ్లాదేశ్ లో కేవలం ఒక్క రోజులోనే అత్యధిక సంఖ్యలో డెంగీ జ్వరాలు ప్రబలాయి. బంగ్లాదేశ్‌లో ఆదివారం రోజు కేవలం 24 గంటల్లో మొత్తం 2,292 కొత్త డెంగీ కేసులు నమోదయ్యాయి. 2023వ సంవత్సరంలో ఒక రోజులో అత్యధికంగా డెంగీతో రోగులు ఆసుపత్రిలో చేరారు....

Dengue Patients : ఒకే రోజు 2,292 మందికి డెంగీ జ్వరాలు…ప్రజల ఆందోళన

Dengue Patients

Dengue Patients : బంగ్లాదేశ్ లో కేవలం ఒక్క రోజులోనే అత్యధిక సంఖ్యలో డెంగీ జ్వరాలు ప్రబలాయి. బంగ్లాదేశ్‌లో ఆదివారం రోజు కేవలం 24 గంటల్లో మొత్తం 2,292 కొత్త డెంగీ కేసులు నమోదయ్యాయి. 2023వ సంవత్సరంలో ఒక రోజులో అత్యధికంగా డెంగీతో రోగులు ఆసుపత్రిలో చేరారు. (Bangladesh records highest number) డెంగీ జ్వరాల వల్ల 9 మంది మరణించారు.

Indonesia : ఇండోనేషియాలో నౌక మునిగి 15 మంది మృతి, 19 మంది గల్లంతు

దీంతో మొత్తం డెంగీ మరణాల సంఖ్య 176కి పెరిగింది. (hospitalization of Dengue Patients) డెంగీ జ్వరాలతో ఒకే రోజు 1,064 మంది ఢాకా నగరంలోని ఆసుపత్రుల్లో చేరారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధికారులు చెప్పారు. మిగిలిన వారు బయట చికిత్స పొందుతున్నారు. బంగ్లాదేశ్‌లో 7,175 మంది డెంగీ రోగులు, రాజధానిలో 4,149 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్యాధికారులు చెప్పారు.

Pakistani Seema Haider : సచిన్ ప్రేమ కోసమే భారత్ వచ్చా…సీమా హైదర్ తాజా వ్యాఖ్య

దేశంలో 32,977 మందికి డెంగీ సోకగా, అందులో 25,626 మంది రికవరీ అయ్యారు. గత ఏడాది 281 మంది డెంగీ జ్వరాలతో మరణించారు. గత ఏడాది కూడా 62,423 మందికి డెంగీ సోకింది. గత 21 రోజుల్లో 109 డెంగీ మరణాలు, 20,465 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఒక్క జులై నెలలోనే 109 మంది డెంగీ జ్వరంతో మరణించారని బంగ్లాదేశ్ సంగ్‌బాద్ సంస్థ వెల్లడించింది. ఈ రెండు నెలలు ఏడిస్ దోమలు వృద్ధి చెందడానికి అనువైనవి కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో డెంగీ జ్వరాల వ్యాప్తి మరింత తీవ్రంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు భయపడుతున్నారు.