Indonesia : ఇండోనేషియాలో నౌక మునిగి 15 మంది మృతి, 19 మంది గల్లంతు

ఇండోనేషియాలో సోమవారం సులవేసి ద్వీపంలోని సముద్రంలో నౌక మునిగింది. ఈ ప్రమాద ఘటనలో 15 మంది ప్రయాణికులు మరణించగా, మరో 19 మంది గల్లంతు అయ్యారు....

Indonesia : ఇండోనేషియాలో నౌక మునిగి 15 మంది మృతి, 19 మంది గల్లంతు

Ferry Sinking In Indonesia

Ferry Sinking In Indonesia : ఇండోనేషియాలో సోమవారం సులవేసి ద్వీపంలోని సముద్రంలో నౌక మునిగింది. ఈ ప్రమాద ఘటనలో 15 మంది ప్రయాణికులు మరణించగా, మరో 19 మంది గల్లంతు అయ్యారు. (Missing In Ferry Sinking) ఆగ్నేయ సులవేసి ప్రావిన్స్ రాజధాని కేందారీకి దక్షిణంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మునా ద్వీపంలోని ఒక బే గుండా ఈ నౌక ప్రయాణికులను తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. (Ferry Sinking In Indonesia)

Tomato prices : ప్రజలు తినడం మానేస్తే టమోటా ధరలు తగ్గుతాయి…యూపీ మంత్రి ప్రతిభా శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రమాదం జరిగినపుడు నౌకలో 40మంది ప్రయాణికులున్నారని వారిలో ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారని ఇండోనేషియా అధికారులు చెప్పారు. రాత్రి సమయంలో నౌక మునిగిపోవడానికి కారణాలు ఇంకా తెలియలేదు. ప్రాణాలతో బయటపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి ముహమ్మద్ అరాఫా చెప్పారు.

Indian woman : భారతీయ మహిళ ఫేస్‌బుక్ స్నేహితుడిని కలవడానికి పాక్ వెళ్లింది…

మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారు. 17,000 కంటే ఎక్కువ ద్వీపాలతో కూడిన ఇండోనేషియాలో నౌకలపై ప్రయాణిస్తుంటారు. దీంతో ప్రమాదాలు అధికంగా జరుగుతుంటాయి. నౌకల ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాలకు తిలోదకాలు ఇవ్వడంతో ప్రయాణికుల ప్రాణాలను రక్షించే పరికరాలు లేకుండా ఓడలను ఓవర్‌లోడ్ చేస్తుంటారు. దీంతో తరచూ ఇండోనేషియాలో ప్రమాదాలు జరుగుతున్నాయి.