Top Headlines: కాంగ్రెస్‌ సునామీలా BRSను ముంచెత్తుతుందన్న భట్టి.. కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దన్న హరీష్ రావు.. 1pm Bulletin

రేపు కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయనుంది. ధరణి స్థానంలో కొత్త యాప్, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు వంటి హామీలను కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపర్చే అవకాశం ఉంది.

Top Headlines: కాంగ్రెస్‌ సునామీలా BRSను ముంచెత్తుతుందన్న భట్టి.. కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దన్న హరీష్ రావు.. 1pm Bulletin

1PM Headlines

Updated On : November 16, 2023 / 2:15 PM IST

1pm న్యూస్ బులిటెన్ ..

హస్తం హామీలు ..
రేపు కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయనుంది. ధరణి స్థానంలో కొత్త యాప్, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు వంటి హామీలను కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపర్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌కు కౌంటర్..
అధికారం కోసం కాంగ్రెస్‌ మాయ మాటలు చెబుతోందని హరీష్ రావు విమర్శించారు. జహీరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

మాదీ గ్యారెంటీ ..
కాంగ్రెస్‌ సునామీలా BRSను ముంచెత్తుతుందని భట్టి విక్రమార్క అన్నారు. వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని తెలిపారు.

లోటస్‌ ర్యాలీ ..
సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి భారీ బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు.

ఇదీ క్లారిటీ..
ఐటీ దాడులను BRS అభ్యర్థి భాస్కర్‌రావు ఖండించారు. తనకు పవర్‌ప్లాంట్‌లు ఉన్నాయన్నది అవాస్తమని క్లారిటీ ఇచ్చారు.

డైరెక్ట్ అటాక్ ..
హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిని ఎమ్మెల్యే బాలకృష్ణ సందర్శించారు. వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.

నిధులెక్కడ?
అప్పులు చేస్తున్నా ఏపీలో అభివృద్ధి లేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు. కేంద్రం నిధులను వైసీపీ సర్కార్‌ దారి మళ్లిస్తోందని ఆరోపించారు.

ఎదురుదాడి..
రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి అమర్ నాథ్ అన్నారు. చంద్రబాబు పోలవరం నిధులు కొట్టేశారని ఆరోపించారు.

నిరసన సెగ ..
రంగారెడ్డి జిల్లా కూర్మిద్దాలో MLA మంచిరెడ్డికి నిరసన సెగ తగిలింది. ఫార్మాసిటీ కోసం భూములు లాక్కున్నారంటూ గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

డోంట్ వర్రీ ..
ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో కార్మికులంతా సేఫ్‌గా ఉన్నారని సీఎం తెలిపారు.

సజీవదహనం ..
చైనాలోని బొగ్గు కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 25 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.

నువ్వా.. నేనా..
వరల్డ్ కప్ 2023లో భాగంగా కాసేపట్లో రెండో సెమీ ఫైనల్ ఫైట్‌ జరగనుంది. సౌతాఫ్రికా, ఆసీస్ జట్లు తలపడనున్నాయి.